నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్. మనసులో భావాలని బయటపెట్టిన పవన్ ?

లోకేష్ జన్మదిన సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్య, ఐటీ రంగాల్లో లోకేష్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపిస్తూ నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు.

flnfln
Jan 23, 2026 - 10:16
 0  3
నారా లోకేష్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్. మనసులో భావాలని బయటపెట్టిన పవన్ ?

* లోకేష్ జన్మదిన సందర్భంగా పవన్ స్పందన 

* పవన్ తన మనసులో ఉన్న బావనంతటిని వెల్లడించారు 

* విద్య, ఐటి రంగాలలో దూసుకు వెళ్తున్న లోకేష్ 

* నిండు నూరేళ్లతో ఉండాలి అని నా ప్రార్ధన అని పవన్ 

fourth line news : మంత్రి లోకేష్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, అయితే శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాష్ట్రం కోసం లోకేష్ పడుతున్న తపనను, ఆయన విజన్ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా తన యొక్క స్పందనను తెలియజేశారు పవన్ కళ్యాణ్. 

లోకేష్ తీసుకు వస్తున్న పథకాలు, b మార్పులు భావితరాలకు ఎంతో ప్రయోజనకరంగా మారిపోతున్నాయి అని పవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, ఉపాధ్యాయులకును తల్లిదండ్రులకు మధ్య వారిదిగా ఉంటూ లోకేష్ వేస్తున్న అడుగులు అభినందనీయమన్నారు. విద్యాపరంగా కాకుండా ఐటి రంగంలోనూ తనదైన శైలిలోని ముందుకు వెళుతూ రాష్ట్ర సంస్థలు రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు కొత్త ఆశలు చిగురింప చేస్తున్నారు అని కొనియాడారు. 

నిరుద్యోగులకు ఉపాధి కలిగించే దిశలో లోకేష్ సిద్ధం చేసిన ప్రణాళికలు రాష్ట్రానికి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి అని ఆశ భాగం వ్యక్తం చేశారు. ప్రాముఖ్యంగా ప్రజాసేవలో లోకేష్ మరింత కొనసాగుతూ, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీరిద్దరి మధ్యలో ఉన్న స్నేహం, అనుబంధం, ప్రేమ, రాష్ట్ర రాజకీయాలలో ఒక సానుకూల వాతావరణాన్ని నింపుతూ వస్తుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.