మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా మారనున్న ‘మొంథా’ – రాష్ట్రానికి అలెర్ట్ జారీ!
మొంథా తుఫాను వేగంగా బలపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నం సమీపంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని Fourth Line News తాజా అప్‌డేట్ తెలిపింది.
అమరావతి, ఫోర్త్ లైన్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ‘మొంథా తుఫాను’ వేగంగా చేరుకుంటోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు APSDMA తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నం నుంచి 230 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 310 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం నుంచి 370 కిలోమీటర్ల దూరంలో వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
మరికాసేపట్లో ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాత్రి నాటికి మచిలీపట్నం – కాకినాడ తీర ప్రాంతాల మధ్య భూమిని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా.
భారీ వర్షాలు, గాలుల దృష్ట్యా తీరప్రాంత ప్రజలు బయటకు రావొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం, APSDMA విజ్ఞప్తి చేశాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0