తుఫాన్ దెబ్బకు విశాఖలో వర్ష బీభత్సం – పలు జిల్లాల్లో భారీ వర్షాలు | Fourth Line News
మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో వర్ష బీభత్సం, పలు జిల్లాల్లో ఈదురు గాలులు. పూర్తి వివరాలు Fourth Line Newsలో చదవండి.
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ బీభత్సం!
మొంథా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో భారీ వర్షం కురుస్తోంది. బలమైన ఈదురు గాలులు వీచడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రోడ్లపై వర్షనీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇక తుఫాన్ ప్రభావం విస్తరిస్తూ, నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షం విస్తారంగా కురుస్తోంది. తుఫాను తీరం వైపు చేరుతున్న కొద్దీ వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రతీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర తీరంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0