బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం.. దక్షిణ కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా–రాయలసీమ జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. – Fourth Line News
* వాయుగుండం ఎఫెక్ట్ దక్షిణ కోస్తా పై,
* మళ్లీ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
* రేపు వాయుగుండం బలపడే అవకాశాలు ఎక్కువ
* ఈ శనివారం ఆదివారంలో కోస్తా రాయలసీమలో
* నెల్లూరు తిరుపతి జిల్లాలకు ఈదురు గాలులు హెచ్చరిక జారి
* ఎవరూ చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్లదు
మరొకసారి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంఘం తెలిపింది.
గురువారం నాటికి ఈ అల్పపీడనం వాయుగుండం గా బలపడునుందని వెల్లడించారు.
అలాగే ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వైపు 48 గంటల్లో మరింతగా బలపడి అటువైపుగా వెళ్లే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం వల్ల చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో సుమారు గంటకు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంగా బలమైన గాలులు విస్తాయని తెలియజేశారు. అలాగే శనివారం ఆదివారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారమైన వర్షాలు పడతాయని అధికారులు నిర్ధారించారు.
ఈ అల్పపీడనం కారణం వల్ల చాపలు పట్టడానికి మత్స్యకారులు ఎవరు సముద్రంలోనికి వెళ్లదు అని విపత్తుల నిర్వహణ సంఘం హెచ్చరించింది. ఈ అల్పపీడనము పోయేంతవరకు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం తెలిపిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడిన 'సెన్యార్' అనే తుపాను ఇప్పటికే ఇండోనేషియా వద్ద తీరం దాటింది అని అధికారులు తెలిపారు.
• ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వాలు తెలిపారు
• ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి
• fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0