మొంథా ప్రభావం.. తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలు
మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వాన పడుతోంది. నర్సంపేట, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక ఖమ్మం, భద్రాద్రి, ములుగు, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
వాతావరణ కేంద్రం ప్రకారం రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0