తెలుగు రాష్ట్రాల్లో ఎముకలు గగుర్పొడిచే చలి… ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకే
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రాత్రికిరాత్రే పెరిగింది. ఏపీలోని జి. మాడుగులలో 6 డిగ్రీలు, TGలో కోహిర్‌లో 7.8 డిగ్రీలు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలలోపే రికార్డు.
ఉత్తర భారతం మాత్రమే కాదు… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత గట్టిగానే వెల్లువెత్తుతోంది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోవడంతో ప్రజలు బయట అడుగుపెట్టడానికే జంకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా జి. మాడుగులలో నిన్న కనిష్ఠంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం సంచలనంగా మారింది. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ పరిస్థితి పెద్దగా భిన్నంగా లేదే. అనేక ప్రాంతాల్లో 16 డిగ్రీలకు దిగువనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
తెలంగాణలో కూడా చలిగాలులు విపరీతంగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో 7.8 డిగ్రీలు నమోదై చలి తీవ్రతను చాటిచెప్పాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 13 డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పొగమంచు ఉదయాలు, చల్లటి రాత్రులు ప్రజలను ఇబ్బందుల్లో నెడుతున్నాయి.
చలి దాడి పెరగడంతో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి దుస్తులు, గోరువెచ్చని ఆహారం ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉపయోగించాలని అంటున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0