ప్రధాని మోడీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు – రాహుల్, ఖర్గే సందేశాలు

ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్‌లో పర్యటించి, పీఎం మిత్ర పార్కు శంకుస్థాపనతో పాటు జాతీయ స్థాయిలో ఆరోగ్య, పోషకాహార పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు.

flnfln
Sep 17, 2025 - 13:04
Sep 17, 2025 - 13:12
 0  4
ప్రధాని మోడీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు – రాహుల్, ఖర్గే సందేశాలు

ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన అగ్ర నేతలు...

• ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గే

• ప్రధాని మోడీ మధ్యప్రదేశ్లో పర్యటించి కీలక పథకాలకు శ్రీకారం చేయనున్నారు .

• చిన్నారులు, మహిళల ఆరోగ్యం కోసం జాతీయస్థాయిలో రెండు పథకాలు తీసుకురాబోతున్నారు. 

• లక్షకు పైగా దేశవ్యాప్తంగా భారీ వైద్య శిబిరాలు ఏర్పాటు.

Introduction : 

75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. Lok Sabha ప్రతిపక్షా నేత అయిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుటము జరిగింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్టు చేశారు. అటువల్లనే మల్లికార్జున ఖర్గే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్షు లభించాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

అలాగే ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రధాన మోడీ మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా, బైంసోలా గ్రామాలలో పర్యటించనున్నారు. మరియు అక్కడ దేశంలోనే మొట్టమొదటిగా పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్) పార్కుకు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు అవుతుంది. 

ప్రధాని మోడీ 2 కీలకమైన జాతీయ పథకాలను ప్రారంభించబోతున్నాను. చిన్నారులు, మహిళలు, కౌమార బాలికల ఆరోగ్యం, ( Helth ) పోషకాహార సేవలను బలోపేతం చేసే లక్ష్యముతో 'స్వస్థ నారి, సశక్తి పరివార్', ఎనిమిదవ 'రాష్ట్రీయ పోషణ్ మాహ్' కార్యక్రమాలకు శ్రీకారం చేయబోతున్నారు. అలాగే ఈరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యక్ష ఆరోగ్య శిబిరాలను నిర్వహించబోతున్నారు. దీనిని దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా చేయబోతున్నారు. 

* ఈ ఆరోగ్య శిబిరాలలో మహిళల కోసం ప్రత్యక్షముగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రక్తహీనత, టీవీ, సికిల్ సెల్ వ్యాధి పరీక్షలతో పాటు గర్భిణీలు బాలింతలకు వైద్య సేవలు అందించబోతున్నారు. ఇంకా మరెన్నో గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ వంటి ప్రత్యేక వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.