Mirai Magic: పాన్ ఇండియాలో తేజ సజ్జ సరికొత్త సంచలనం

Mirai starring Teja Sajja is winning hearts with stunning visuals, divine elements, and strong audience response. From Telugu to pan-India, critics are praising its VFX and storytelling. Read the full Mirai movie review.

yskysk
Sep 13, 2025 - 07:28
 0  5
Mirai Magic: పాన్ ఇండియాలో తేజ సజ్జ సరికొత్త సంచలనం

మిరాయ్ మ్యాజిక్: పాన్ ఇండియాలో తేజ సజ్జ సరికొత్త సంచలనం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా "పాన్ ఇండియా" అనే పదం బాగా వినిపిస్తోంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘హనుమాన్’ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్ పెంచాయి. అయితే ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియా ట్యాగ్ పెట్టుకున్నా, ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు నిలబడలేకపోయాయి.

అలాంటి సమయంలో మిరాయ్ అనే చిన్న సినిమా ట్రైలర్‌తోనే అందరినీ ఆకర్షించింది. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడటం, డివైన్ ఎలిమెంట్స్‌ని కొత్తగా చూపించడం వల్ల సినిమాకు క్రేజ్ పెరిగింది.

సినిమా విడుదలైన తర్వాత కూడా అదే హైప్ కొనసాగింది. నార్త్ ఇండియన్ క్రిటిక్స్ కూడా మిరాయ్ సినిమాకి మంచి రేటింగ్స్ ఇచ్చారు. Advance bookings పెద్దగా లేకపోయినా, word of mouth వల్ల హిందీ ప్రేక్షకులు కూడా సినిమా వైపు వాలుతున్నారు.

తేజ సజ్జ ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ‘హనుమాన్’తో పేరు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాలో మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యేకంగా భారీ పక్షి ఎపిసోడ్, యాక్షన్ సీన్స్, VFX పనితనం చాలా బాగా చేశారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

సినిమాలోని డివైన్ టచ్, కొత్తగా చూపించిన Visual Grandeur వల్ల మిరాయ్ ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో తన ప్రభావం చూపుతుందని ట్రేడ్ పండిట్లు విశ్వసిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0