రాజమండ్రి శివారులో పెద్దపులి కలకలం: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కెమెరాలో పులి కదలికలు ..!
రాజమండ్రి శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దివాన్ చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాల్లో పులి కదలికలు నమోదయ్యాయి. అటవీ శాఖ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. పూర్తి వివరాలు చదవండి.
* పులి నీ చూడాలనుకోవడం వేరు, దానికి ఆహారం ఇవ్వడం వేరు
* రాజమండ్రి దివాన్ చెరువు పరిధిలో పెద్దపులి
* సీసీ కెమెరాల్లో రికార్డయిన పెద్దపులి కదలికలు
* ఎటువైపు నుంచి పులి దాడి చేస్తుందని ప్రజలు భయం
* అటవీశాఖ పులిని పట్టుకునేందుకు ప్రయత్నం!
ఫోర్త్ లైన్ ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచరించడం ప్రజల్లో భయాన్ని కలగజేసింది. ఇప్పటివరకు అయితే పెద్దపులి పాదము ముద్రలే కనిపించగా, నిన్న రాత్రి కెమెరాలో పెద్దపులి కనిపించడం జరిగింది. రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో పెద్దపులి కదలికలు పెరగడంతో స్థానికులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీ శాఖ అధికారులు నిన్న ఉదయం రాజమండ్రి శివారులోని గాడాల ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. అటువైపుగా కారులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు పెద్దపులి వీడియోను చిత్రీకరించి, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది వెలిల్ అయింది. గాడాల ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు స్పష్టముగా అటవీ శాఖ గుర్తించగా అక్కడ పులిని పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశారు.
రాజమండ్రి శివారు ఆటోనగర్ వెనుక ప్రాంతంలో పెద్దపులి ఉంది అని స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు కట్టిన స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటిలోన పెద్దపులి దివాన్ చెరువు పరిధిలో ఉన్న ఎస్ వి పి ఎస్ ఫంక్షన్ హాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కొబ్బరి తోటలోనికి వెళ్ళినట్టు సమాచారం అందుకున్నారు. దీనితో అధికారులందరూ ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మొన్నటిదాకా ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనికి ప్రవేశించినట్టు అధికారులు భావిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 1 నా రాజమండ్రి రూరల్ పరిధిలోని తొర్రేడులో పులి పశువు పై దాడి చేసి చంపిన ఘటన కూడా కలకలం రేపింది. ఆ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ఘటనపై స్థానిక ప్రజలు ప్రతినిధులు మరియు అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో వారి వెనకాల పెద్దపులి కల్పించడం ఆందోళనను మరింత పెంచింది అని చెప్పుకోవచ్చు.
పులి కనిపించడంతో అటవీశాఖ అధికారులు వేగవంతంగా అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బి.ఎన్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో డీఎఫ్‌వో ప్రభాకరరావు, ఎఫ్‌ఆర్‌వో దావీదురాజు నాయుడు, డీఆర్‌వో శ్రీనివాస్‌రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్.శ్రీనివాసరావు తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పులిని ఎలాగోలా పట్టుకునేందుకు పూణేలోని నిపుణులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నామని బుధవారం ఉదయానికి వారిని రాజమహేంద్రవరం రప్పించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎటువైపు నుంచి పులి దాడి చేస్తుందో అని ప్రజలందరూ భయభ్రాంతుల్లో ఉన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0