Siddipet medical College : జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య... కారణాలేంటి?
సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న లావణ్య ఆత్మహత్య. హాస్టల్ గదిలో పారాక్వాట్ ఇంజక్షన్ తీసుకుని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి. పూర్తి వివరాలు ఇక్కడ.
* హాస్టల్ గదిలో లావణ్య గడ్డి ముందు ఇంజక్షన్ ఎందుకు తీసుకుంది?
* హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి.
* పని ఒత్తిడి నీట్ ఫీజ్ వల్లనే , ఆత్మహత్య
* పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ...
ఫోర్త్ లైన్ న్యూస్ : సిద్దిపేటలో స్థానిక మెడికల్ కాలేజీలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ గదిలో పారాక్వాట్ గడ్డి మందు (పంట చేలలో కలుపు నివారణకు ఉపయోగించే విషపూరితమైన మందును) ఆ యువతి ఇంజక్షన్లు తీసుకొని చాలా డేంజర్ స్థితిలోనికి వెళ్ళగా, హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ ఆ యువతి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసినట్టు తెలుస్తుంది.
అసలు వివరాల్లోనికి వెళ్తే : బోగులంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య (2020 బ్యాచ్ ) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సజ్జన్ పూర్తి చేసి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆమె తన గదిలో గడ్డి మందును ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆమెను సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడున్న వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగని చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. చేస్తున్న డ్యూటీలో ఒత్తిడి, మరోవైపు నీట్ ఫీజ్, వంటి కారణాలతో లావణ్య మానసికంగా వేదనకు గురైనట్టు కాలేజీ సిబ్బంది భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని మృతులాలి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.
మరి వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి? ఇంతకీ లావణ్య టెన్షన్స్ కారణం వల్ల చనిపోయిందా? మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా. ఈక అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0