కర్నూలు బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ అరెస్ట్
కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసి, బస్సు యజమాని కోసం గాలిస్తున్నారు. రమేశ్ ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు జిల్లాలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదం కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
అదే కేసులో A2 నిందితుడైన బస్సు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లా ప్రయాణికుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి పది నిమిషాల ముందు ఆ మార్గం గుండా వెళ్లిన 35 మంది ఇతర డ్రైవర్లను విచారించిన అనంతరం, డ్రైవర్ నిర్లక్ష్యంనే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0