నారావారిపల్లెలో సంక్రాంతి సందడి.. చంద్రబాబు కుటుంబంతో కలిసి పండుగ సంబరాలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండల నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, క్రీడా కార్యక్రమాలు, విద్యార్థులకు బహుమతులతో పండుగ వాతావరణం ఉట్టిపడింది.
* సంక్రాంతి వేడుకలలో సీఎం చంద్రబాబు కుటుంబం సందడి
* తిరుపతి జిల్లా చంద్రగిరి మండల నారావారిపల్లెలో వేడుకలు
* క్రీడలు పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు
* చాలా అద్భుతంగా సంబరాలు ఆకట్టుకున్నాయి
fourth line news : సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లా చంద్రగిరి మండల నారవాదిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ టిడిపి కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు.
అలాగే స్థానికంగా పాఠశాలలో జరిగిన క్రీడా పోటీలను వీక్షించారు. క్రీడా పోటీలు చాలా ఆసక్తికరంగా సాగాయి. క్రీడ పోటీలలో విజేతలుగా గెలిచిన వారిని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులను, అక్కడ సిబ్బందిని ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు కూడా దిగారు.
ఈ వేడుకల్లో నారా బ్రహ్మణి, తేజస్విని, ఎంపీ శ్రీ భరత్, నారా రోహిత్, నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో మంత్రి లోకేశ్ తనయుడు నారా దేవాన్చ్ కూడా వివిధ గ్రామీణ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తాత చంద్రబాబు చేతులమీదుగా ఓ ప్రైజు కూడా అందుకున్నాడు.
మరి మీరు మీ యొక్క ప్రాంతాలకు వెళ్లి సంబరాలు జరుపుకుంటున్నారా? ఈ సంక్రాంతి పండుగ మీ కుటుంబాలతో సంతోషంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0