సార్లంకపల్లె : అగ్నిప్రమాదం తర్వాత సీఎం చంద్రబాబు చెప్పిన ఒక్క మాట ఎందుకు వైరల్ అవుతోంది?

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధిత కుటుంబాలకు తక్షణంగా ఒక్కొక్కరికి ₹25,000 ఆర్థిక సాయం, పూర్తిగా దగ్ధమైన తాటాకు ఇళ్లకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.

flnfln
Jan 13, 2026 - 11:06
Jan 13, 2026 - 12:55
 0  3
సార్లంకపల్లె : అగ్నిప్రమాదం తర్వాత సీఎం చంద్రబాబు చెప్పిన ఒక్క మాట ఎందుకు వైరల్ అవుతోంది?

సీఎం చంద్రబాబు నాయుడు బాధితులకు 25000 సాయం ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సార్లంకపల్లె చోటు చేసుకున్న అగ్ని ప్రమాద గతంలో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించి, ఆ ప్రమాదానికి బాధ్యత కుటుంబాలకు తక్షణమే సహాయంగా ఒక్క కుటుంబానికి 25000 అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. 

ప్రాముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన తాటాకు ఇళ్లకు, బాధ్యతులకు కొత్త ఇల్లు మంజూరు చేయాలి అని సీఎం ఆదేశించారు. శాశ్వత నివాసం ఏర్పాట్లు వరకు బాధ్యుతులకు తాత్కాలిక వసతి, ఆహారం, త్రాగునీరు, దుస్తులు తదుపరి మౌలిక సదుపాయాలు అందించాలని అధికారులకు తెలియజేశారు. బాధ్యత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం సమయస్ఫూర్తితో పని చేయాలి అని ఆదర్శించారు. 

సీఎం చంద్రబాబు ఈ ఘటనలో ఏ ఒక్క ప్రాణనష్టం జరగలేదు కాబట్టి రాష్ట్రమంతా ఊపిరి పీల్చుకుంది అని పేర్కొన్నారు. ఆస్తి నష్టం భారీగా జరిగినందున బాధ్యతలకు ప్రభుత్వం పరంగా పూర్తి సహాయము అందించాలి అని ప్రజలకు భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

నిన్నసార్లంకపల్లె అగ్నిప్రమాదం లో దాదాపుగా 40 తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి . సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తక్షణమే బాధ్యత కుటుంబాలకు సహకార చర్యలు చేపట్టాలి అని అధికారులకు నిర్దేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. 

* ఈ అగ్ని ప్రమాదంపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.