కర్నూలు బస్సు ప్రమాదం.. ఒక్క నిర్లక్ష్యం 19 ప్రాణాలు తీసింది

కర్నూలు బస్సు ప్రమాదంపై కొత్త వివరాలు బయటపడ్డాయి. 19 వాహనాలు బైకును తప్పించుకున్నా, చివరగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్క నిర్లక్ష్యం 19 ప్రాణాలను తీసింది – Fourth Line News.

flnfln
Oct 28, 2025 - 10:06
 0  3
కర్నూలు బస్సు ప్రమాదం.. ఒక్క నిర్లక్ష్యం 19 ప్రాణాలు తీసింది

కర్నూలు, ఫోర్త్ లైన్ న్యూస్:

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 2.45 గంటల సమయంలో బైక్ నడిపిన శివశంకర్ డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ బైకు రోడ్డు మధ్యలో పడిపోయింది.

దానికి కేవలం పది నిమిషాల తర్వాత, సుమారు 2.55 గంటలకు వెళ్తున్న వీ కావేరీ బస్సు ఆ బైకును ఢీకొట్టింది. అయితే ఈలోగా 19 వాహనాలు అదే మార్గంలో వెళ్లి కూడా ఆ బైకును తప్పించుకున్నాయి. కానీ బస్సు డ్రైవర్ మాత్రం దాన్ని గుర్తించలేకపోయాడు.

ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక దృష్టిఅభావమా? అనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒక్కరు ఆ బైకును రోడ్డు పక్కకు జరిపి ఉంటే, 19 ప్రాణాలు కాపాడేవి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.