Palakollu Couple : పాలకొల్లు జంట ... అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం....

పాలకొల్లుకు చెందిన కృష్ణ కిషోర్, ఆశ దంపతులు అమెరికా వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి పిల్లలకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Jan 5, 2026 - 12:02
 0  9
Palakollu Couple : పాలకొల్లు జంట ... అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం....

* అమెరికా 10 సంవత్సరాలుగా సిరబడ్డారు 

* సొంత గ్రామానికి వచ్చి సరదాగా గడిపారు? 

* అమెరికా చేరుకున్నాక ప్రమాదంలో మరణించారు. 

* ఇంతకీ ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అంటే?

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం: పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే వారి పిల్లలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం వస్తుంది. 

పూర్తి వివరాల్లోనికి వెళ్తే : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిషోర్, ఆశ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. కిషోర్ అమెరికాలోని 10 సంవత్సరాలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తూ ఉన్నారు. పది రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో దుబాయ్ లో ఆగి న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నారు. 

స్వగ్రామంలో అందరితో కలిసి ఆనందంగా గడిపి, న్యూ ఇయర్ కూడా సంతోషంగా జరుపుకున్నారు కానీ ఇంతలోనే ఈ దుర్ఘటన జరగటంతో కిషోర్ కుటుంబ సభ్యులు బంధువులు ఎంతో రోదిస్తున్నారు. అమెరికాలో వాషింగ్టన్ లో ప్రయాణిస్తున్న వారి కార్యక్రమాలు జరిగింది. ఈ ప్రమాదంలో కిషోర్ అతని భార్య, ఆశ అక్కడే మరణించారు పోలీసులు వెల్లడించారు. కుమార్తె, కొడుక్కి తీవ్ర గాయాలు అయ్యాయి, వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్య అందిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వార్త కుటుంబ సభ్యులకి తెలిసిన వెంటనే వాళ్లు పూర్తి దుఃఖములోనికి మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడి కుటుంబ సభ్యులతో కాసేపు ఆనందంగా ఉన్నవాళ్లు శాశ్వతంగా దూరమైపోయారు. ఈ వార్త మీకు ఎలా అనిపించింది? 

మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి 

గమనిక : ఈ లోకంలో మన జీవితం ఎప్పుడూ ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి జీవించినంత కాలం సంతోషంగా ఆనందంగా ఉందాము.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0