రోడ్లకు గుడ్‌బై? గుంటూరు నుంచి ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయా? గుంటూరులో తయారైన ఈ ఎయిర్ ట్యాక్సీలు భద్రతా పరీక్షలు పూర్తి చేశాయి. సేవలు ఎప్పటి నుంచి?

flnfln
Jan 9, 2026 - 07:15
Jan 9, 2026 - 07:21
 0  3
రోడ్లకు గుడ్‌బై? గుంటూరు నుంచి ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయా?

fourth line news :రోడ్ల ట్రాఫిక్‌కు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయా?

* ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయనే వార్త ఆసక్తి రేపుతోంది.

* గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఎయిర్ ట్యాక్సీలు ఇప్పటికే అన్ని భద్రతా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి.

AP: రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తు ప్రయాణ విధానంగా ఎయిర్ ట్యాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ ఈ ఆధునిక ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధి చేసింది. సంస్థ ఎండీ అభిరామ్ నేతృత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ ఎయిర్ ట్యాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారితంగా పనిచేస్తాయని, పర్యావరణానికి హానికరమైన కార్బన్ ఉద్గారాలు లేకుండా డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలోని ఉష్ణోగ్రతలు, గాలివేగం, వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వీటిని రూపొందించారు.

ఇప్పటికే ఈ ఎయిర్ ట్యాక్సీలు అన్ని భద్రతా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ నావిగేషన్ టెక్నాలజీ, డ్యూయల్ బ్యాటరీ బ్యాకప్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఒక్కసారిగా 2 నుంచి 4 మంది ప్రయాణికులు ప్రయాణించేలా వీటిని రూపొందించినట్లు సమాచారం.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, రెండేళ్లలో వాణిజ్య సేవలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో ప్రధాన నగరాలు, ఎయిర్‌పోర్టులు, ఐటీ హబ్‌ల మధ్య ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది.

ఇప్పటికే ప్రజలు ట్రాఫిక్ సమస్యలకు ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండంగా ఎయిర్ ట్యాక్సీలు వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోనికి వస్తాయి అని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో మంచి పేరును ఈ సంస్థ పొందుకోవచ్చు. మరి చూడాలి మరి కేంద్ర ప్రభుత్వాలు వీటిని ఆమోదిస్తాయా లేదా అనేది? 

*నిజంగా ఇది ప్రయాణానికి సులువైనవేనా? 

*మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.