ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్రదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దేశ ప్రజలకు రాజ్యాంగ విలువలపై కీలక సందేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలు చదవండి.

flnfln
Jan 26, 2026 - 11:20
 0  4
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు, మంత్రి  లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

* దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన గణతంత్రదిన వేడుకలు. 

* ఇది 77వ గణతంత్రదిన. ప్రజల్లో అపురూపమైన ప్రేమ 

ఈరోజు భారతదేశమంత ఎంతో సంతోషంగా ఈ 77వ గణతంత్రదిననీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదటిసారి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏపీ పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా దేశ ప్రజలందరికీ 77వ గణతంత్రదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటంటే? 

'సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం రావటం వల్లనే మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాము. అలాంటి రాజ్యాంగం అమలులోనికి వచ్చిన ఈరోజును మనందరం ఘనంగా సంతోషంగా జరుపుకుందాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాదులు వేసింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి' అంటూ సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చారు.

నారా లోకేష్ ఇచ్చిన సందేశం ఏమిటంటే? 

దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అంటూ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇంకా పలువురు మంత్రులు, అధికారులు దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు అని తమ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.