ఖమ్మం : ఓడిన భర్తల స్థానంలో గెలిచిన భార్యలు – రాజకీయాల్లో కొత్త చర్చ
ఖమ్మం జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన భర్తల స్థానంలో భార్యలు గెలవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మహిళా నాయకత్వానికి ఇది బలమైన సంకేతంగా నిలిచింది.
Main points :
1. ఖమ్మం జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఆసక్తికర మలుపు తీసుకున్నాయి.
2. గతంలో ఓడిన భర్తల స్థానంలో భార్యలు గెలవడం మహిళా నాయకత్వానికి నిదర్శనం.
3. ప్రజలు వ్యక్తిని కాకుండా సామర్థ్యాన్ని, సేవను చూసి ఓటు వేస్తున్నట్టు తెలుస్తోంది.
4. చింతకాని మండలంలో ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
5. గ్రామీణ రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత బలపడుతున్న సంకేతం ఇది.
6. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో ఖమ్మం ఉదాహరణగా నిలిచింది.
Fourth Line News – ప్రతినిధి కథనం: తెలంగాణలో జరిగే సర్పంచ్ ఎన్నికలు యమ జోరుగా సాగాయండి. ఖమ్మం జిల్లాలో అయితే సర్పంచ్ ఎన్నికలు చాలా ఊహించని విధంగా జరగటం విశేషంగా మారింది. భర్తలు ఓడిన భార్యలు మాత్రము గెలిచారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం ఇదే టాపిక్ మాట్లాడుకోవడం విశేషంగా మారింది.
చింతకాని మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో ఆశక్తికర ఫలితాలు నమోదు అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. గత సంవత్సర ఎన్నికల్లో భర్తలు ఓడిపోగా ఈసారి ఎన్నికల్లో భార్యలు పోటీలో నిలిచి గెలిచి వారి సత్తా చాటడం జరిగింది.
మత్కేపల్లి నామవరంలో 2019 లో కాంగ్రెస్ తరపున నేత కంచ కోటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి మాత్రం అతని భార్య ద్రౌపతి పోటీ చేసి 392 ఓట్ల మెజారితో విజయం సాధించడము విశేషంగా మారింది. అలాగే పందిళ్ళపల్లి గ్రామంలో సిపిఎం నేత వత్సవాయి జానకి రాములు తన భార్య పద్మ సర్పంచిగా గెలుపొందడం జరిగింది.
గత సంవత్సరంలో భర్తలు ఓడిపోయిన కూడా ఈ సంవత్సరంలో భార్యలు పోటీ చేసి గెలవడం ఖమ్మం జిల్లాలో విశేషముగా మారింది. దీని ప్రకారం చూస్తే తెలంగాణలో అన్ని జిల్లాలు పంచాయతీ ఎన్నికలు ఎంత రసవత్రంగా జరిగాయో తెలుస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖమ్మం జిల్లా మండలాలు గ్రామాల్లో జరిగే ప్రతి విషయం ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు చదవచ్చు. Fourth Line News – ప్రతినిధి కథనం:
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0