ఖమ్మంలో చైన్ స్నాచింగ్ కలకలం: మహిళ గొలుసు లాక్కొని దొంగ పరార్
ఖమ్మం బైపాస్ రోడ్డులో మహిళపై జరిగిన చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. నున్న సంధ్య నుండి బంగారు గొలుసు లాక్కొని దొంగ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం నగరంలో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బైపాస్ రోడ్డున వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగ ఒకరు ఒక్కసారిగా లాక్కొని పరారయ్యాడు. నేలకొండపల్లి మండలానికి చెందిన నున్న సంధ్య కుటుంబ కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా చైతన్య నగర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. గొలుసును లాక్కొన్న నిందితుడు సమీపంలోని కాలువ కట్ట దారి గుండా పరుగెత్తి వెళ్లిపోయాడు. ఘటనపై సంధ్య ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0