జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయపాటు.. అభిమానులకు భరోసా ఇచ్చిన టీమ్

Tollywood star Jr NTR suffered a minor leg injury during an ad shoot in Hyderabad. Doctors advised two weeks rest, and his team confirmed there is no need to worry.

flnfln
Sep 19, 2025 - 22:38
 0  3
జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయపాటు.. అభిమానులకు భరోసా ఇచ్చిన టీమ్

జూనియర్ ఎన్టీఆర్ గాయపాటు.. ఫ్యాన్స్ టెన్షన్‌లో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో గాయపడినట్టు వచ్చిన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఒక కమర్షియల్ షూట్‌లో పాల్గొనగా.. తారక్ కాలికి స్వల్ప గాయం జరిగినట్లు సమాచారం. వెంటనే ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్లు ఆయనకు రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం NTR-Neel అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, సెట్లో కాదు కానీ హైదరాబాదులో జరుగుతున్న ఓ యాడ్ షూట్‌లో ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది.

బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఒక కంపెనీ ప్రకటన చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ఎన్టీఆర్ కిందపడి కాలికి దెబ్బలు తగిలాయి. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు.

తారక్‌కి గాయం జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీమ్ స్పష్టతనిస్తూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.

“ఈరోజు యాడ్ షూట్‌లో తారక్ స్వల్పంగా గాయపడ్డారు. వైద్యుల సూచన మేరకు రాబోయే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అభిమానులు, మీడియా ఎటువంటి ఊహాగానాలను నమ్మవద్దు” అని టీమ్ స్పష్టం

 చేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.