చెన్నై–వ్లాడివోస్టాక్ తూర్పు కారిడార్‌పై భారత్–రష్యా కీలక ముందడుగు:
చెన్నై–వ్లాడివోస్టాక్ తూర్పు కారిడార్ అమలులోకి వస్తే భారత్–రష్యా సరుకు రవాణా సమయం 40 రోజుల నుంచి 24 రోజులకు తగ్గనుంది. మోడీ–పుతిన్ చర్చల వివరాలు Fourth Line News అందిస్తున్న ప్రత్యేక కథనం.
* చైనా టు రష్యా నూతన సరుకుల రవాణా
* రష్యా కు మన నౌకలు వెళ్లడానికి 40 రోజులు పడుతుంది
* నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేక చర్చలు
* చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు
* 5,700 కి.మీ దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news: చైనా నుంచి రష్యా నూతన సరుకు రవాణా మార్గం ఏర్పడింది. భారత్ రష్యా మధ్య సరుకుల రవాణా సమయం రానున్న కాలంలో సగం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం రష్యాకు మన సరుకులు ద్వారా చేర్చడానికి 40 రోజుల సమయం పడుతుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు. ఇది కార్యరూపం దాలిస్తే 5,700 km దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు సరుకులు చేరుకుంటాయి. ప్రపంచ ఉద్రిక్తల నేపథ్యంలో ఇది చాలా సురక్షితమైన మార్గముగా ఉంది అని భావిస్తూ ఉన్నారు. ఇది గనక ఖరారు అయితే భారత్ నౌకలు రష్యా కి 24 రోజుల్లోనే వెళ్లే అవకాశం ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల్లో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ కొత్త రూట్ అత్యంత సురక్షితంగా, వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. ఇది అమలులోకి వస్తే భారత్‌కు వ్యాపార పరంగా భారీ లాభాలు చేకూరనున్నాయి. అలాగే రష్యా–భారత్ మధ్య సరుకు మార్పిడి వేగం కూడా దారుణంగా పెరుగుతుంది.
ఇటీవల పుతిన్ భారత్ పర్యటనలో మోడీ–పుతిన్ మధ్య అనేక అంశాలపై చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వ్యాపార మార్గాలను సులభతరం చేయడం, వాణిజ్య వ్యవస్థను వేగవంతం చేయడం వంటి అంశాల్లో రెండు దేశాలు ఒకే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలపరుస్తూ, భవిష్యత్తులో ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూర్చే కీలక అడుగు కానుంది. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0