భారత్ మూడో స్థానం – అమెరికా, చైనా తర్వాత మనదే శక్తివంతమైన దేశం

ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారత్ మూడో స్థానాన్ని సాధించింది. అమెరికా, చైనా తర్వాత అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఎదగడం దేశ గౌరవాన్ని పెంచింది. ఆర్థిక, సైనిక, దౌత్య రంగాల్లో భారత్ సాధించిన పురోగతి వివరాలు – Fourth Line News.

flnfln
Nov 28, 2025 - 15:07
 0  3
భారత్ మూడో స్థానం – అమెరికా, చైనా తర్వాత మనదే శక్తివంతమైన దేశం

* ఆసియాలో మూడో స్థానంలో చేరింది 

* అమెరికా చైనా తర్వాత మనమే భారత్ 

* ఆసియా పవన్ ఇండెక్స్ లో భారత్ మూడోసారి

* మన ముందు చైనా అమెరికా దేశాలు 

* దీనికి కారణం ఆర్థిక సైనిక సామర్థ్యాలు 

అంతర్జాతీయ వార్తలు

ఫోర్తులై న్యూస్ : ఆసియాలో భారత్ తన విలువను ఎంతో పెంచుకుంటుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని మరింత పెంచుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత థింక్‌ట్యాంక్ 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారత్ మూడో స్థానానికి కైవసం అచ్చింది. ఈ జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో అమెరికా ఉంది. 

దాదాపుగా ఆసియాలోని 27 దేశాలు ప్రాంతాలు శక్తి సామర్థ్యాలను అంచున వేస్తూ ఏటా యొక్క వేదికను విడుదల చేస్తారు. అలాగే సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైన పలుకుబడి , మరియు 8 అంశాల పరిశోధనలో 131 చూసి కల ఆధారంతో ఈ ర్యాంకింగ్ ను కేటాయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం భారత్ 40 పాయింట్లు స్కోరుతో తన ర్యాంకును చూపి తొలిసారిగా మేజర్ పవర్ హోదాను దక్కించుకుంది. ఈ మూడో స్థానం భారత్ సామర్థ్యాన్ని ఆసియాలోని ఉన్న దేశాలకి ప్రత్యక్షంగా కనపరుస్తుంది. 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన తర్వాత, భారత్ మాత్రం బలమైన పునరుజ్జీవనంతో ముందుకు సాగిందని ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటం, భౌగోళిక రాజకీయ రంగంలో పెరుగుతున్న ప్రాభవం, రక్షణ వ్యవస్థలో జరుగుతున్న ఆధునికీకరణ—ఈ అంశాలన్నీ భారత శక్తి పెరిగే దిశగా సహకరించాయని విశ్లేషణలో స్పష్టం చేసింది.

ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌ ప్రభావం ఎక్కువగా పెరిగినప్పటికీ, చైనాతో పోలిస్తే ఇంకా పెద్ద తేడా ఉందని నివేదిక పేర్కొంది. ఆసియా ప్రాంతంలోని సంచలనాత్మక ర్యాంకింగ్స్‌లో అమెరికా 81.7 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి తన దాధాగిరిని కొనసాగిస్తోంది. వెంటనే 73.7 స్కోరుతో చైనా రెండో స్థానంలో నిలిచి అమెరికాతో ఉన్న అంతరాన్ని క్రమంగా తగ్గిస్తోంది.

2019 తర్వాత రష్యా తన శక్తిని మళ్లీ పెంచుకోవడమే ఈ సంవత్సరపు నివేదికలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు జపాన్ శక్తి స్థిరంగా కొనసాగుతుండగా, ఆగ్నేయాసియా దేశాలు స్వల్పమైన పురోగతి చూపించినట్లు విశ్లేషణ వెల్లడించింది.

భారత్ ఆర్థిక, రక్షణ, దౌత్య రంగాల్లో అభివృద్ధి కొనసాగితే—భవిష్యత్తులో ఆసియా ప్రాంతీయ శక్తి సమీకరణల్లో కీలక పాత్ర పోషించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* మన దేశం అన్ని దేశాలకి పోటీస్తుంది ఇది చాలా సంతోషకరమైన శుభవార్త 

* అన్ని దేశాలతో కలిసిమెలిసి ఉండి అన్ని విధాలుగా మన దేశం అభివృద్ధి చెందాలి అని మనందరం కోరుకోవాలి. 

* ముఖ్యంగా సరిహద్దులో మన సైనికులు బలంగా ఉండాలి దేశంలో ఉన్న రైతులు ఆనందంగా ఉండాలి. అన్ని మార్గాల్లోనూ మన దేశం ముందుకు వెళ్లాలి.

* మన దేశం మూడో స్థానంలో ఉండటం చాలా గర్వంగా ఉంది. 

* మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.