ఇమ్రాన్ ఖాన్: పూర్తిగా క్షేమంగానే ఉన్నారని స్పష్టత
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి పుకార్లపై అడియాలా జైలు స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అసత్యమని, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల ఆందోళనలు, పిటిఐ స్పందన వివరాలు.
* ఇమ్రాన్ ఖాన్ పూర్తి అనారోగ్యంతో ఉన్నారు
* పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి అంటూ
* పుకార్లను ఖండించిన అడియాల జైలు
* ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని స్పష్టత
* కనీసం కుటుంబ సభ్యులతో భేటీకి అనుమతి
* చాలా రోజుల కలవకపోవడంతో సోదరీమణులు
ఇమ్రాన్ ఖాన్ మరణించారు అంటూ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం. దీనిపైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఫోర్త్ లైన్ న్యూస్ :
పాకిస్తాన్ మాజీ ప్రధాని పి టి ఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆ వార్తలు ఎలాంటి నిజం లేదని ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని గురువారం జైలు అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఆయనను జైలు నుంచి ఎక్కడికి తరలించలేదని ప్రస్తుతం తమ వద్దనే క్షేమంగా ఉన్నారు అని అధికారులు వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి తరలించాలని కథనాల్లో ఎలాంటి వాస్తవము లేదు అని జైలు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఉంది. ఆయనకు అవసరమైన వైద్యం అలాగే సంరక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన అనారోగ్యం పట్ల వస్తున్న వార్తలన్నీ నిరార్ధమైనవని వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఇమ్రాన్ ఖాన్ గురించి పి టి ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ యొక్క విషయంపై క్లారిటీ ఇవ్వాలి అని అలాగే ఇమ్రాన్ ఖాన్ తో ఆయన కుటుంబ సభ్యులు భేటీని తక్షణమే ఏర్పాటు చేయాలి అని అధికారులని డిమాండ్ చేశారు.
గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయనను కలిసేందుకు అధికారులు అనువర్తించకపోవడంతో అనేక అనుమానాలు వాటిల్ని మరింత బలపడ్డాయి.
ఇమ్రాన్ ఖాన్ కలవడానికి అనుమతించకపోవడంతో తన సోదరీమణులు అలీమా ఖాన్, నూరీన్ ఖాన్, ఉజ్మా ఖాన్ , మంగళవారం ఆడియాలా జైలు బయట గంటల తరబడి నిరసన తెలిపారు. లోపల ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? బహుశా ఇమ్రాన్ ఖాన్ వేరే చోటుకు తరలించి ఉండవచ్చు అందుకే మమ్మల్ని కలవనివ్వడం లేదా అని ఆయన సోదరీమణులు అనుమాన వ్యక్తం చేశారు. దేశంలోనే చాలా అరాచక పాలన నడుస్తుంది అని ఆమె విమర్శించారు.
ఇమ్రాన్ ఖాన్ ను 2022లో అవిశ్వాస తీర్మానంతో అధికారం కోల్పోయిన అతన్ని అవినీతి ఉగ్రవాదం వంటి పలు కేసుల్లో ఆగస్టు 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పై వస్తున్న వార్తలు ఎంత నిజమో అనేది ఎవరికీ తెలియదు.
* మరి ఇమ్రాన్ ఖాన్ పై వస్తున్న వార్తలు ఎంత నిజం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0