హైదరాబాద్‌లో ....... ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కుటుంబంపైకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు ....
హైదరాబాద్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* తెలంగాణ హైదరాబాదులో నుండి బ్రేకింగ్ న్యూస్
* ఒక ఇన్నోవా కారు అతివేగంతో
* పాత్ పై నిద్రిస్తున్న వారి మీదికి దూసుకు వెళ్ళింది
* ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు
* గాయపడిన వారిని ఆసుపత్రిలకే తరలింపు
* పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే :
fourth line news కథనం : హైదరాబాదులోని తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పిన ఓ ఇన్నోవా కారు. పూర్తి వివరాల్లోనికి వెళ్తే : అతివేగంతో వస్తున్న ఇన్నోవా కారు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి మీదికి దూసుకు వెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందగా మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. జీవనాన్ని కొనసాగించడం కోసం హైదరాబాద్కు వచ్చిన కుటుంబంలో ఘోర విషాదం నెలకొంది.
అసలేం జరిగింది అంటే: ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రభు మహారాజ్ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చి రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు అమ్ముకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు రాత్రిపూట దుకాణాన్ని మూసి అక్కడే ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నారు. అయితే శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళుతున్న ఇనోవా కారు, అతివేగంగా నడపటం వల్ల అద్భుతప్పి నీరుగా వీధి పైకి దూసుకు వెళ్ళింది.
ఈ ఘోర ప్రమాదంలో ప్రభు మహారాజ్ కుమారుడు దీపక్ అక్కడే మృతి చెందగా. తండ్రి మరియు మరో కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి కారణమైన వాళ్లు ముగ్గురు పరారవ్వగా, ముగ్గురిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణాలు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే అని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఎటు నుంచి ఏది వచ్చి బుద్ధితో ఎవరికి తెలియట్లేదు. రోడ్డుపైన వెళ్తున్న వారు జాగ్రత్తగా వెళ్లాలి అని అధికారులు ఆదేశిస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి : fourth line news
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరిగే అన్ని వార్తలని మీరు చదవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0