19 ఏళ్లలో 11 మంది పిల్లలు… కుమారుడు కావాలనే కోరిక తల్లిని ప్రమాదంలోకి నెట్టిందా?

హర్యానాలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒక్క మగబిడ్డ కోసం 10 మంది కుమార్తెలకు జన్మనిచ్చిన దంపతుల కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి? పూర్తి వివరాలు చదవండి.

Jan 7, 2026 - 12:06
Jan 7, 2026 - 20:51
 0  5
19 ఏళ్లలో 11 మంది పిల్లలు… కుమారుడు కావాలనే కోరిక తల్లిని ప్రమాదంలోకి నెట్టిందా?

* ఒక్క మగపిల్లాడి కోసం పది మంది ఆడపిల్లల్ని కన్నారా? 

* హర్యానాలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. 

* ఆ దంపతులు 11 మంది పిల్లలకు అన్నారు? 

* ఎందుకు 11 మందిని కన్నారో తెలిస్తే మతిపోతుంది? 

 fourth line news : మన భారతదేశంలో ఇంత మంది జనాభా ఉండటానికి బలమైన కారణం ఇదే అనుకుంటా హర్యానాలో జరిగిన సంఘటన ఇది ,కుమారుడు కావాలనే కోరికతో ఏకంగా 11 బిడ్డలకు జన్మనిచ్చిన దంపతులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త రాకెట్ లాగా దూసుకు వెళుతుంది. వారికి పెళ్లయి 19 సంవత్సరాలు. పదిమంది కుమార్తెలే, కొడుకు కావాలి అని దంపతులు పట్టుబట్టి 10 మందిని కన్న తర్వాత ఎట్టకేలకు ముఖ బిడ్డకు జన్మనిచ్చారు. జీoద్ జిల్లా ఉచానా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అరుదైన ప్రసవం జరిగినట్టు సమాచారం. 

పూర్తి వివరాల్లోనికి వెళ్తే: ఫతేహాబాద్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల మహిళ ఈనెల జనవరి 3వ ఆస్పత్రిలో చేరా. ఇప్పటికే దాదాపుగా 10 మందిని కనడంవల్ల ఆమె కొంత అనారోగ్యానికి గురైంది. ఇది 11వ ప్రసవం అత్యంత ప్రమాదకరంగా మారింది అని వైద్యులు నర్వీర్ షియోరాన్ తెలిపారు. అయితే ప్రస్తుతం సమయంలో ఆమెకి మూడు యూనిట్ల రక్తం ఎక్కించవలసి ఉంది అని తెలియజేశారు. ప్రస్తుతమైతే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని ఆయన వెల్లడించారు. 

ప్రసవం తర్వాత ఒక బిడ్డ జన్మించడం ఆ పదిమంది అక్కల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పదిమంది అక్కలు ఆ తమ్ముడికి ''దిల్ ఖుష్ " అని పేరు పెట్టుకున్నారు. తండ్రి అయితే రోజువారి కూలీగా పనిచేస్తూ తన పదిమంది కుమార్తెలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె అయితే 12వ తరగతి చదువుతున్నంగా, చిన్న కుమార్తెలు ఇంకా బడికి వెళ్లే వయసులో ఉన్నట్టు సమాచారం. అయితే పదిమంది కుమార్తెల పేర్లు గుర్తు తెచ్చుకోవడానికి తండ్రి ఇబ్బంది పడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కుమారుడు కోసం ఏకంగా పదిమంది కుమార్తెలు కనడం పై కొంత ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుమారుడు కోసం ఒరిస్సా ప్రసవాలు చేయడం తల్లి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు ఇద్దరినీ హెచ్చరించడం జరిగింది. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి! ఒక్క కుమారుడు కోసం పది మందిని కానీ వాళ్ళని ఏ విధంగా పెంచుతారు మరి?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0