కిలో రూ. 40,000.. హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ అరుదైన పుట్టగొడుగుల కథేంటో చూడండి!

హిమాలయ అడవుల్లో లభించే అత్యంత ఖరీదైన 'గుచ్చి మష్రూమ్స్' విశేషాలు తెలుసుకోండి. కేజీ రూ. 40 వేలు పలికే ఈ పుట్టగొడుగులు ఎక్కడ దొరుకుతాయి? వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 23, 2025 - 16:28
 0  7
కిలో రూ. 40,000.. హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ అరుదైన పుట్టగొడుగుల కథేంటో చూడండి!

1. వామ్మో ఈవి దట్టమైన మంచు కురిసే ప్రాంతాల్లోనే పెరుగుతాయా 
2. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల అడవులలో 
3. కేజీ వచ్చేసి 30 వేల నుంచి 40 వేల 
4. వీటిని ఏమంటారు తెలుసా ? 
5. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే కింద ఉన్న సమాచారం అంతటినీ చదవండి.

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; గుచ్చి మష్రూమ్స్ (Morchella esculenta) అనేవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అడవి మష్రూమ్స్‌గా పేరుగాంచాయి. భారతదేశంలో వీటిని సాధారణంగా గుచ్చి, మొరెల్స్, లేదా మోర్చెల్లా అని పిలుస్తారు. కేజీ ధర రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండటంతో ఇవి “అడవిలో దొరికే బంగారం”గా కూడా ప్రసిద్ధి చెందాయి. ఇంత విలువైన ఈ మష్రూమ్స్ ఎక్కడ పెరుగుతాయి? ఎందుకు అంత ఖరీదైనవి? అనే విషయాలను తెలుసుకుందాం.

గుచ్చి మష్రూమ్స్ సహజంగా మంచు కరిగే సమయం, అంటే వింటర్ ముగింపు మరియు వసంతకాల ప్రారంభంలో మాత్రమే పెరుగుతాయి. సాధారణంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఇవి కనిపిస్తాయి. మంచు కరిగిన తర్వాత తేమతో నిండిన నేల, చల్లని వాతావరణం, మరియు ప్రత్యేకమైన మట్టి పరిస్థితులు గుచ్చి మష్రూమ్స్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇవి సంవత్సరం పొడవునా కాకుండా చాలా తక్కువ కాలంలోనే లభిస్తాయి.

భారతదేశంలో గుచ్చి మష్రూమ్స్ ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ (HP), ఉత్తరాఖండ్, మరియు జమ్మూ & కాశ్మీర్ (J&K) వంటి ఉత్తర భారత పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, మంచుతో కప్పబడే ప్రదేశాలు గుచ్చి మష్రూమ్స్ సహజ నివాసాలు. ముఖ్యంగా దేవదారు, పైన్, ఓక్ వంటి చెట్లు ఉన్న అడవుల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి.

గుచ్చి మష్రూమ్స్ సాధారణంగా తడి నేలలో, రాలిపోయిన ఆకుల కింద, చెట్ల వేర్ల దగ్గర, మరియు అడవిలోని నీడ ఉన్న ప్రదేశాల్లో మొలుస్తాయి. ఇవి నేలపై పూర్తిగా కనిపించకుండా, కొంత భాగం ఆకులు లేదా మట్టితో కప్పబడి ఉండటం వల్ల గుర్తించడం చాలా కష్టం. అందుకే అనుభవం ఉన్న అడవి ప్రజలు లేదా స్థానికులు మాత్రమే వీటిని సులభంగా గుర్తించగలుగుతారు.

ఈ మష్రూమ్స్‌ను సేకరించడం చాలా కష్టమైన పని. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వారాలపాటు నడుచుకుంటూ, చల్లని వాతావరణాన్ని తట్టుకుంటూ వెతకాలి. ఒక రోజు మొత్తం శ్రమించినా చాలా తక్కువ పరిమాణమే దొరుకుతుంది. అంతేకాదు, అడవుల్లో వన్యప్రాణుల భయం, ప్రమాదకరమైన భూభాగం కూడా ఈ పనిని మరింత కఠినంగా మారుస్తాయి. ఈ కష్టమే గుచ్చి మష్రూమ్స్ ధర ఎక్కువగా ఉండటానికి ఒక ప్రధాన కారణం.

గుచ్చి మష్రూమ్స్ కు మన వంటకాలలో ప్రత్యేకమైన స్థానము ఉంది. ఇవి మామూలు సాధారణ రెస్టారెంట్లో దొరకవు వీటికి ఉండే ప్రత్యేకమైన ఆ రుచి ఆ సువాసన కారణంగా ఖరీదైన రెస్టారెంట్లో అంతర్జాతీయ హోటల్లో వీటిని ఉపయోగిస్తాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే యూరప్, అమెరికా, మరియు మధ్యప్రాచ్య దేశాల్లో వీటికి బారే డిమాండ్ ఉంది. వీటిని ఏఏ వంటకాలు వాడుతారు అంటే పాస్తా, సూప్స్, గ్రేవీలు, మరియు ప్రత్యేక వంటకాలు మాత్రమే వాడుతారు. 

ఇవి కేవలము వంటలకే పరిమితం కాదు వీటిని. సంప్రదాయ వైద్య పద్ధతిలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో మనకి కావాల్సినవి ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే వీటి యొక్క విశేషత జీర్ణక్రియ మెరుగుపడటం, రోజు నిరోధక శక్తిని ఎక్కువగా పెంచడం వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని స్థానికులు నమ్ముతారు. 

గుచ్చి మష్రూమ్స్ అరుదుగా లభించడం. మరియు సహజ పరిస్థితులపై ఆధారపడటం. ముఖ్యంగా సేకరణలో ఉన్న కష్టం. అంతర్జాతీయ డిమాండ్ కారణంగా ఇవి అత్యంత ఖరీదైన మష్రూమ్స్ గా నిలవడం జరిగింది. ఇది ప్రకృతిచే ఒక వరమైన మష్రూముగా ప్రజలు భావిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న అడవులను సంరక్షించడం ఎంత ప్రాముఖ్యమో ఈ మష్రూమ్ మనకి తెలియజేస్తుంది. ప్రతి అడివిలోనూ ఏదో ఒక ప్రాముఖ్యమైన మూలిక, ఆహార పదార్థం పెరుగుతూ ఉంటాయి, అందుకనే అడవులను రక్షించి పర్యావరణాన్ని కాపాడుదాము. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.