డ్యూడ్ మూవీకి కళ్లుచెదిరే కలెక్షన్స్ — చిన్న హీరో సినిమా భారీ విజయగాథ
ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్యూడ్’ సినిమా రెండు రోజుల్లోనే రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. చిన్న హీరో మూవీకి రికార్డ్ స్థాయి కలెక్షన్స్.
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన ‘డ్యూడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.
మొదటి రోజే రూ.22 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం, రెండో రోజు మరింత జోరుగా దూసుకెళ్లి రూ.23 కోట్లు వసూలు చేసింది. చిన్న హీరో సినిమా ఇంత పెద్ద రేంజ్ కలెక్షన్స్ సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ప్రేక్షకుల నుంచి కూడా మంచి టాక్ రావడంతో ‘డ్యూడ్’ మూడో రోజు కూడా హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0