ఢిల్లీ ఊపిరి పీల్చుకోవాలంటే భయం.. గాలిలో యాంటీబయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియా!
ఢిల్లీ గాలిలో యాంటీబయాటిక్స్‌కు లొంగని స్టాఫిలోకాకస్ సూపర్‌బగ్ ఉనికిని జేఎన్యూ అధ్యయనం వెల్లడించింది. WHO పరిమితులకు మించి 16 రెట్లు బ్యాక్టీరియా వ్యాప్తి నమోదైంది.
1. ఢిల్లీలో గాలి కాలుష్యం చాలా చెడిపోయింది
2. ఢిల్లీ గాలిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా?
3. JNU శాస్త్రవేత్తలు నిర్ణయించిన పరిశోధన.
4. ఎక్కువగా, మురికివాడ, ట్రాఫిక్ ఉన్నచో, ఆస్పత్రి పరిసరాలలో... mm
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ఢిల్లీ గాలిలో ప్రమాదకరమైన స్టాఫిలోకాకస్ (Staphylococcus) బ్యాక్టీరియా ఉనికి కలకలం రేపుతోంది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో, యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని సూపర్‌బగ్ లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా గాలిలో విస్తృతంగా వ్యాపించినట్టు వెల్లడైంది.ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఢిల్లీ నగరాలలోని మురికి వాడలు, అధిక ప్రజలు ఉన్న ప్రాంతాలు, మరియు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు హాస్పిటల్లో పరిసరాల ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు
ఈ స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా వల్ల న్యుమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లు (సెప్సిస్), చర్మ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపారు.
పరిశోధనలో గాలిలో ఉన్న బ్యాక్టీరియా పరిమాణం WHO నిర్దేశించిన పరిమితికి 16 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇది కేవలం వాయు కాలుష్యమే కాకుండా, జీవాణు కాలుష్యం (Bio-pollution) కూడా ఢిల్లీలో తీవ్రమైన సమస్యగా మారిందని సూచిస్తోంది. కాలుష్యం, చెత్త నిర్వహణ లోపాలు, మురుగు నీటి సమస్యలు, అధికమైన జనాభా, ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరం లేని రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం, అలాగే ప్రభుత్వం గాలి నాణ్యత నియంత్రణ, పారిశుధ్య చర్యలు, ఆస్పత్రుల పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో ఇతర మహానగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ప్రజలు ఈ వాయు కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇదే చాలా అన్నట్టు ఈ బ్యాక్టీరియా కూడా రావటం వల్ల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వాయు కాలుష్యం తగ్గించాలి అని ప్రజలు అధికారులకు విన్నవించుకుంటున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0