దీపావళి సంబరాలు.. కానీ జాగ్రత్త! టపాసులు పిల్లలకు ప్రమాదకరం
దీపావళి సందర్భంగా వైద్యుల హెచ్చరిక — టపాసులు పిల్లల ఆరోగ్యానికి హానికరం. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచన.
దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉంటుంది. అయితే ఈ వేడుకల వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేకంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయరాదు.
టపాసుల వల్ల కలిగే పొగ, దుమ్ము లంగ్స్‌పై ప్రభావం చూపి సీరియస్ అలర్జిక్ రియాక్షన్లకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.ఇలాంటి సందర్భాల్లో పిల్లల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుని, వేడుకలు పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0