కేంద్రం వద్ద ఏపీ నిధుల కోసం సీఎం చంద్రబాబు కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్ట్ సహాయం, కేంద్ర పథకాల పెండింగ్ బకాయిలపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు.

flnfln
Dec 19, 2025 - 15:30
 0  4
కేంద్రం వద్ద ఏపీ నిధుల కోసం సీఎం చంద్రబాబు కీలక చర్చలు

* సీఎం చంద్రబాబు ఢిల్లీ ఆర్థిక మంత్రి తో భేటీ 

* ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులపై చర్చ 

* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బడ్జెట్ నిధులు కేటాయించాలి అని 

* పోలవరం నన్నవల్ల ప్రాజెక్ట్ చేయుట 

* కేంద్ర పథకాలకు సంబంధించిన పెండింగ్ నిధులు కూడా 

* పూర్తి వివరాల్లోకి వెళితే 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ తో భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కోరారు. అలాగే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలి అని వినతి పత్రము సీఎం చంద్రబాబు అందించారు. అలాగే కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలి అని ఆర్థిక మంత్రి నిర్మల సీత రామన్ తో చెప్పారు. 

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎక్కువగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి ఎంతగానో కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు నారా లోకేష్ కూడా విదేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పెట్టడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఎట్టకేలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి అని దృఢ సంకల్పం తీసుకున్నట్టు వార్తా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులను తీసుకువచ్చాము అని పలుమార్లు నారా లోకేష్ వెల్లడించడం జరిగింది. సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో చెప్పిన నిధులన్నీ వస్తాయి అని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో జరిగే ప్రతి అంశాలను ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు చదవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.