మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చాడు.. దేవుడిలా ప్రాణం పోసిన ఆర్ఎంపి!
ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లిలో గుండెపోటుతో కుప్పకూలిన లక్ష్మయ్యను సమయానికి CPR చేసి ప్రాణాలు కాపాడిన RMP ఘటన అందరి మనసులను కదిలించింది.
* లక్ష్మయ్య అనే వ్యక్తి గుండెపోటుతో పడిపోయాడు
* అక్కడే ఉన్న RMP, CPR చేసి అతని బ్రతికించాడు
* గ్రామస్తులు అందరూ RMP అభినందించారు
* CPR వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది అని డాక్టర్లు
ఖమ్మం ఫోర్త్ లైన్ ప్రతినిధి : ఖమ్మం బోనకల్లు మండలంలో జరిగిన సంఘటన బట్టి అందరూ మెచ్చుకుంటున్నారు, ఇంతకీ ఏం జరిగింది అంటే బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి లో ఒక ఆర్ఎంపి ఒక వ్యక్తిని కాపాడడం జరిగింది. ఆదివారం గ్రామంలో జరిగిన దశదినకర్మలో పాల్గొన్న పగడాల లక్ష్మయ్య 65 స్మశాన వాటిక వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. లక్ష్మయ్య కింద పడిపోయిన వెంటనే ప్రజలందరూ కొంత ఆందోళన చెందారు. అక్కడే ఉన్న RMP వెంటనే ఆయనకు సిపిఆర్ చేశాడు. CPR చేసిన కొద్దిసేపటికి లక్ష్మయ్య కోల్పోవడంతో అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో దైవంలా వచ్చే ప్రాణాలు కాపాడిన డాక్టర్ RMP నీ గ్రామస్తులు అందరూ అభినందించారు.
నిజానికి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే లక్ష్మయ్య ప్రాణాలు పోయేవి. నిజానికి చాలామందికి సిపిఆర్ చేయడము ఎలానో తెలియదు. తెలిసిన కూడా ఒకవేళ చేస్తే మనకేమైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అని భయపడుతూ చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇలా వెనకడికి వేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సిపిఆర్ చేస్తే కచ్చితంగా ఆ వ్యక్తి బతికే అవకాశం 100 శాతం ఉంది అని డాక్టర్లు వెల్లడించారు. కాబట్టి ఎలాంటి భయాలు లేకుండా మీ వంతు సహాయము మీరు చేయండి. అలాగే సిపిఆర్ తెలియని వాళ్లు సిపిఆర్ ఎలా చేయాలో అవగాహన తెచ్చుకోండి. సిపిఆర్ నేర్చుకుంటే మన ఇంట్లో వాళ్లకైనా ఏమైనా ప్రమాదం జరిగితే సిపిఆర్ మనకి ఉపయోగపడుతుంది.
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ గుండెపోటు సమస్యతో చనిపోతూ ఉన్నారు. అందుకని ప్రజలు సిపిఆర్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందిగా అధికారులు డాక్టర్స్ ప్రజలకి తెలుపుతూ ఉన్నారు. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా ప్రతి జిల్లాలోనూ, మండలాల్లోనూ, గ్రామాలలో జరిగే ప్రతి విషయాలను మీరు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా చదవచ్చు.
రచయిత: శివ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో, మండలాలలో, గ్రామాలలో, జరిగే అన్ని విషయాలను రాయడం జరుగుతుంది. అలాగే వాతావరణానికి సంబంధించిన వార్తలు కూడా రాయడం జరుగుతుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0