ఏపీ ఉల్లి రైతులకు భారీ ఊరట! రూ.128 కోట్ల పరిహారం నేరుగా ఖాతాల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం రూ. 128 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. హెక్టారుకు రూ. 20,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ-క్రాప్ వివరాల ఆధారంగా జరుగుతున్న ఈ పంపిణీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

flnfln
Dec 27, 2025 - 12:24
 0  17
ఏపీ ఉల్లి రైతులకు భారీ ఊరట! రూ.128 కోట్ల పరిహారం నేరుగా ఖాతాల్లోకి

ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ – ప్రభుత్వం కీలక నిర్ణయం

1. ఆంధ్రప్రదేశ్లో సరైన ధరలు లేక వాతావరణ సమస్యల వల్ల ఉల్లి రైతులు కష్టాలు. 
2. నష్టపోయిన ఒళ్ళు రైతులకు ప్రభుత్వం అండగా. 
3. 128 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేసింది 
4. హెక్టారుకు 20000 చొప్పున సహాయం 
5. కర్నూలు కడప జిల్లాలో ఇప్పటికే 37,752 ఉల్లి రైతులకు పరిహారం 
6. మిగిలిన జిల్లాలకు కూడా త్వరలోనే అందజేస్తాం. 
7. పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని అంతటినీ చదవండి. 

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సరైన మార్కెట్ ధరలు లేకపోవడం, మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో ఉల్లి పంటకు భారీ నష్టాలు సంభవించాయి. సాగు ఖర్చులు పెరిగినా, పంట దిగుబడులకు తగిన ధరలు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ఉల్లి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది.

రైతులకు తక్షణమే ఊరటనిచ్చేలా ప్రభుత్వం మొత్తం రూ.128 కోట్ల నష్టపరిహారంగా విడుదల చేసింది. అర్హులైన ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఈ ఆర్థిక సహాయం అందించనుంది. రైతులు పంట సాగు చేసిన విస్తీర్ణం ఆధారంగా ఈ పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ పరిహారం పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ-క్రాప్ ఐడీని ఆధారంగా తీసుకుంది. ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే సాయం అందేలా చర్యలు చేపట్టింది. మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల అవినీతికి అవకాశం ఉండదు అని ప్రభుత్వం భావిస్తుంది.

ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో పరిహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 37,752 మంది రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కావడంతో రైతులందరూ సంతోషం  వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు సాగుకు చేసిన అప్పులు తీర్చుకోవడానికి, తదుపరి పంట కోసం సిద్ధమవడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఉల్లి పంటకు సంబంధించి ఈ ఏడాది అనేక సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయింది. మరికొన్ని చోట్ల వర్షాభావం కారణంగా దిగుబడి తగ్గింది. అంతేకాకుండా మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు కొంత ఊరట కలుగుతుంది.

వ్యవసాయ శాఖ అధికారులు అందరూ జిల్లాలో వారిగా రైతుల వివరాలను పరిశీలిస్తూ అర్హులైన వారందరికీ త్వరగా నష్టపరిహారము అందజేస్తాము అని వెల్లడిస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ద్వారా రూపించబడుతుంది అని రైతులు ఎలాంటి ఆందోళన చెందద్దు అని అధికారులు రైతులకు వెల్లడించారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులందరూ తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాలి అని అధికారులు సూచించారు. 

నష్టపోయిన రైతు సంఘాలు కూడా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరలా రాకుండా ఉల్లి పంటకు దిగుమతి ధర కల్పించాలి అని రైతుల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అధికారులు కూడా భవిష్యత్తులో ఇలాంటి అనర్ధాలు తలెత్తకుండా కావలసిన చర్యలు తీసుకుంటాము అని అధికారులు చెబుతూ ఉన్నారు. అలాగే రైతులు అధికారులను కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, మార్కెట్ మద్దతు ధర, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.. 


మొత్తంగా చూస్తే ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు నష్టాలకు కొంతమేరకు ఉపశమనం కలిగింది అని ప్రజలు భావిస్తున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారము చెల్లించడమే కాకుండా వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. మిగిలిన జిల్లాలో కూడా రైతు పరిహారము అందించి రైతుల కష్టాలను తొలగించాలి అని అందరూ ఆశిస్తున్నారు. 
మరి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఈ యొక్క పథకం మీకు ఎలా అనిపించింది. మరి ఈ విషయాన్ని నష్టపోయిన రైతులందరికీ షేర్ చేయండి.  ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.