CPR చేసి ఉపాధ్యాయుడు ప్రాణాలు కాపాడిన విద్యార్థి..! ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే....?

నెల్లూరు గండిపాలెం ZP హైస్కూల్‌లో ప్రేయర్ సమయంలో కుప్పకూలిన ఉపాధ్యాయుడిని విద్యార్థి CPR చేసి ప్రాణాలు కాపాడిన ఘటన. విద్యార్థి కిరణ్ సిద్ధార్థ్ చేసిన సాహసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

flnfln
Feb 7, 2026 - 10:17
 0  3
CPR చేసి ఉపాధ్యాయుడు ప్రాణాలు కాపాడిన విద్యార్థి..! ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే....?

* ప్రేయర్ టైం లో కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు

* అక్కడే ఉన్న స్టూడెంట్ CPR చేసి ప్రాణాలు కాపాడాడు 

* ఇంతకుముందు కూడా వాళ్ళ నాన్నమ్మకు CPR చేసాడు 

* ఆ విద్యార్థిని అందరు అభినందిస్తున్నారు 

* ఇంతకీ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా! 

ఫోర్త్ లైన్ ప్రతినిధి : గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు, అక్కడే ఉన్న విద్యార్థి CPR చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్టిక్, గండిపాలెం ZP హైస్కూల్లో జరిగింది. ఉపాధ్యాయులందరూ విద్యార్థులందరూ ప్రేయర్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఉపాధ్యాయుడు ( మాలకొండారెడ్డి ) అకస్మాత్తుగా పొయ్యారు. 

అది గమనించిన విద్యార్థి కిరణ్ సిద్ధార్థ్ ఆయనకు CPR చేశారు.. సృహులోనికి వచ్చిన టీచర్ని ఇతర టీచర్లు కలిసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీంతో మాస్టర్ యొక్క ప్రాణాలు కాపాడిన స్టూడెంట్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే తన నానమ్మకు కూడా సిపిఆర్ చేసినట్టు సమాచారం. CPR అనేది ఎంత ప్రాముఖ్యము ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది. అందుకనే ప్రతి ఒక్క కుటుంబంలో CPR చేయడం నేర్చుకొని ఉండటం ఆ కుటుంబానికి చుట్టుపక్కల ప్రజలకు చాలా మంచిది అని అధికారులు చెప్తున్నారు. మరి ఆ విద్యార్థి చేసిన సాహసం మీకు ఎలా అనిపించింది! అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.