జనవరిలో 2 వేల DSC పోస్టులకు నోటిఫికేషన్ రాబోతోంది
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 2026లో 2 వేల టీచర్ పోస్టుల కోసం DSC నోటిఫికేషన్ విడుదల కానుంది. టెట్ కూడా త్వరలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
జనవరిలో 2 వేల టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ రాబోతోంది
అమరావతి: విద్యాశాఖ జనవరి 2026లో DSC నోటిఫికేషన్ విడుదలకు సన్నద్ధమవుతోంది. మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు ఈ చర్య చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి సుమారు 2,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో స్పెషల్ DSC, మెగా DSCలో మిగిలిన 406 పోస్టులు అలాగే రిటైర్ అయ్యే టీచర్ల ఖాళీలు కూడా కలిపి నోటిఫికేషన్‌లో ఉండనున్నాయి.
ఇకపోతే, TET పరీక్షను కూడా త్వరలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు వంటి అంశాల్లో NCTE నిబంధనలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0