అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి – అల్లు అర్జున్ రాకపై

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారనే వార్త. అల్లు అర్జున్ రాకపై అప్‌డేట్. డిసెంబర్ 5న అఖండ 2 గ్రాండ్ రిలీజ్.

flnfln
Nov 25, 2025 - 16:26
 0  4
అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి – అల్లు అర్జున్ రాకపై

* బాలకృష్ణ అఖండ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం

* ఫ్రీ రిలీజ్ ఈవెంట్ 28న ఘనంగా జరగనుంది 

* అల్లు అర్జున్ బిజీగా ఉండటంవల్ల రాకపోవచ్చు 

* డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ 

* వచ్చేనెల డిసెంబర్ 4 నుంచి ప్రీమియర్ షోలకు 

* అఖండ 2 ఏ విధమైన విధ్వంసం చేస్తుందో చూడాలి అని ఫ్యాన్స్

* జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ అరుపులతో కేకలతో 

బోయపాటి శ్రీను కాంబినేషన్‌లోవస్తున్న భారీ చిత్రం అఖండ 2 హీరోగా నటిస్తున్న నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే అఖండ సినిమాతో అద్దర కొట్టిన ఈ కాంబినేషన్ మరోసారి అఖండ 2 తో మళ్లీ వస్తుంది. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమంలో వేగవంతం చేయడం జరుగుతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 28న నిర్వహించబోతున్నారు అయితే ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. 

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా సక్సెస్ చేయాలి అని నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంకో భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నట్టు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోతున్నాను అని తెలిసింది. అయితే సినిమా విడుదలయ్యాక జరిగే సక్సెస్ మీటింగ్లో అల్లు అర్జున్ పాల్గొని అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘జాజికాయ జాజికాయ’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక విడుదలకు ముందే హైప్ పెంచేందుకు నిర్మాతలు ప్రత్యేక ప్లాన్‌లో ఉన్నారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలని భావిస్తున్న చిత్రబృందం, ఇందుకు అవసరమైన అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అనుమతులు లభించిన వెంటనే తొలి ప్రదర్శనలపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

* మరి బాలయ్య బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయాన్ని తెలుపండి 

* బాలయ్య బాబు నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టము తెలియజేయండి 

* మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా ఆడాలి అని fourth line news వారు కోరుకుంటున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.