అడ్డంకులు తొలగి 'అఖండ 2'కి గ్రీన్ సిగ్నల్ — డిసెంబర్ 12నే విడుదల? | Fourth Line News

అఖండ 2 విడుదలపై వివాదాలు తొలగడంతో డిసెంబర్ 12న దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశం బలపడింది. మద్రాస్ హైకోర్టు అనుమతి తర్వాత అధికారిక ప్రకటన రానుంది. Fourth Line News పూర్తి కథనం.

flnfln
Dec 9, 2025 - 16:41
 0  3
అడ్డంకులు తొలగి 'అఖండ 2'కి గ్రీన్ సిగ్నల్ — డిసెంబర్ 12నే విడుదల? | Fourth Line News

* వివాదానికి శుభ కార్డు. అఖండ 2 విడుదల 

* ఈనెల 12న దేశవ్యాప్తంగా విడుదల అవకాశం 

* మద్రాస్ హైకోర్టు అనుమతి తర్వాత అధికారిక ప్రకటన 

* బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ 

* అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు 

* పూర్తి వివరాల్లోకి వెళితే : 

 fourth line news : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ 2. తాండవం విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్టే. నిర్మాణ సంస్థ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ నెల ఐదున విడుదల కావలసిన సినిమా కొన్ని అన్నవారే కారణాలవల్ల ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ వివాదాలు అన్ని తొలగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యే అవకాశం ఉంది అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. 

సినిమా వివాదం కారణంగా సినిమా రిలీజ్ ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. సోమవారం రాత్రి ఈ రెండు సంస్థల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి అని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రావడంతో వివాదము ముగిసినట్టే అని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమాచారం ఈరోజు ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టుకు నివేదించి సినిమా విడుదలకు అధికారిక అనుమతులు తీసుకున్నారు. 

సినిమా వివాదం ముగియడంతో అఖండ 2 సినిమా ఈ నెల 12న దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సనాహాలు చేస్తున్నారు. ఒకరోజు ముందే అంటే 11న ప్రీమియర్ షోలో ప్రదర్శించే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే సినిమా ప్రమోషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ వార్త బాలయ్య అభిమానులకు నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. బాలయ్య ఫ్యాన్స్ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తూ ఉన్నారు. మరి బాలకృష్ణ నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.