దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా ఆధార్ నంబర్లు రద్దు – మరణించిన
దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా మరణించిన వారి ఆధార్ నంబర్లను UIDAI రద్దు చేసింది. ఆధార్ దుర్వినియోగం నివారణ, డేటాబేస్ శుద్ధి లక్ష్యంగా తీసుకున్న ఈ చర్యల వివరాలు చదవండి. కుటుంబ సభ్యులు మై ఆధార్ ద్వారా స్వయంగా డీయాక్టివేషన్ చేయవచ్చని సమాచారం.
* రెండు కోట్లకు పైగా ఆధార్ కార్డులు రద్దు చేశారు
* యుఐడిఏఐ వారు మరణించిన వారి ఆధార్ నెంబర్లను
* ఆధార్ వివరాల దుర్వినియోగాన్ని అడ్డు కట్టేందుకు
* మరణించిన వారి ధ్రువీకరణ పత్రంతో ఆధార్ రద్దు
* పూర్తి ఇన్ఫర్మేషన్ కింద ఉన్న మ్యాటర్ ని చదవండి
fourth line news: యుఐడిఏఐ సంస్థ దేశవ్యాప్తంగా మరణించిన వారి ఆధార్ నెంబర్లను రద్దు ( డీయాక్టివేట్ ) చేసినట్టు బుధవారం వెల్లడించారు. ఆధార్ డేటాను దుర్వినియోగం కాకుండా ఉండటానికే ఈ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
యుఐడిఏఐ ఇచ్చిన సమాచార ప్రకారం గత ఏడాది జనవరి నుంచే జాతీయ సమాచార ప్రక్షాళ ప్రక్రియలో భాగంగా ఈ డి ఆక్టివేషన్ చర్యలు ప్రారంభమైతాయని తెలియజేశారు. అలాగే ఇందుకోసమే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం మంత్రత్వం శాఖ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మరణించిన వారి సంబంధిత సమాచారాన్ని స్వీకరించి వాటిని ఆధారం చేసుకొని ఆధార్ నెంబర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈ భాగంలోనే ఆధార్ డేటాబేస్ సమగ్రతను కాపాడటమే తమ ప్రాముఖ్య ఉద్దేశమని వారు వెల్లడించారు.
మరణించిన వ్యక్తి ఆధార్ నెంబర్ను కుటుంబ సభ్యులు రద్దు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు యుఐడిఏఐ ప్రకటించింది. మరణించిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రాన్ని మై ఆధార్' వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఆధార్ రద్దు చేయడానికి ఇది సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
* మీ కుటుంబంలో మరణించిన వ్యక్తి ఆధార్ నెంబర్ను మీరు రద్దు చేయించవచ్చు
* ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0