భక్తి ముందు ఓడిన వృద్ధాప్యం: 102 ఏళ్ల వయసులో మూడోసారి శబరిమల యాత్ర

కేరళకు చెందిన 102 ఏళ్ల పారుకుట్టి అమ్మ భక్తి అసాధారణమైనది. వృద్ధాప్య భారంతో ఇబ్బంది పడకుండా, వరుసగా మూడోసారి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆ వివరాలు మీ కోసం.

flnfln
Dec 22, 2025 - 21:18
 0  6
భక్తి ముందు ఓడిన వృద్ధాప్యం: 102 ఏళ్ల వయసులో మూడోసారి శబరిమల యాత్ర

1. 102 ఏళ్ళున్న బామ్మ శబరిమల కి వచ్చిందంట 
2. ఇది మూడోసారి అంట శబరిమలకు రావడం. 
3. 100 సంవత్సరంలో మణికంఠుడి చెంతకు
4. నమ్మకం అనేది ఉంటే ఎంతటి అయినా సాధించొచ్చు 
5. ఘనంగా దేవుని దర్శించుకుంది భామ 
6. కింద ఉన్న పూర్తి వివరాలను చదవండి :

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; 

దైవ చింతన ముందు వయస్సు ఓ అడ్డంకి కాదని మరోసారి నిరూపించారు 102 ఏళ్ల పారుకుట్టి అమ్మ. కేరళకు చెందిన ఈ వృద్ధురాలు అచంచలమైన భక్తితో మూడోసారి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని భక్తుల్లో ఆశ్చర్యం కలిగించారు. 2023లో తన 100వ ఏట తొలిసారి అయ్యప్ప స్వామి దర్శనం పొందిన ఆమె, ఆ తరువాత కూడా భక్తి తగ్గకుండా ప్రతి ఏడాది కొండెక్కాలని సంకల్పం చేసుకున్నారు.

శారీరకంగా బలహీనత ఉన్నప్పటికీ, మనోధైర్యం, నమ్మకం ఆమెకు బలమయ్యాయి. డోలీల సహాయంతో 18 మెట్లు చేరుకున్న పారుకుట్టి అమ్మ, “స్వామియే శరణం అయ్యప్ప” అనే నినాదంతో కొండపై అడుగుపెట్టిన క్షణం అక్కడున్న భక్తులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఆమెను చూసిన యువ భక్తులు సైతం భక్తితో తలవంచారు.

అధికారులు, దేవస్థాన సిబ్బంది ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం ఏర్పాటు చేశారు. వయస్సు ఎంతైనా భక్తి ఉంటే దైవ దర్శనం సాధ్యమేనని ఆమె జీవితం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. శారీరక శక్తి కన్నా మనసులోని నమ్మకమే గొప్పదని, భక్తి ముందు వృద్ధాప్యం కూడా ఓడిపోతుందని పారుకుట్టి అమ్మ కథ చెబుతోంది. 

102 ఏళ్ళు ఉన్న భామ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చింది అంటే భామ మామూలుది కాదు కదా ! అని ప్రజలు భావిస్తున్నారు. ఈ వయసులో కూడా దైవత్వం పైన నమ్మకం పెట్టుకుంది అంటే దేవుని ఆశీస్సులు ఎంతగానో పొందుకున్నలా అని ఈ వార్త తెలిసిన వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. మరి మీరు కూడా ఇప్పుడైనా శబరిమల వెళ్లారా మీ యొక్క అభిప్రాయాన్ని కచ్చితంగా మాకు తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.