భార్య, ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన? వికారాబాద్
వికారాబాద్ జిల్లాలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ట్రాక్టర్ ప్రమాదంగా మలిచిన భార్య, ప్రియుడి దారుణ హత్య పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
* భర్త ఉండగానే వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం
* భర్తకి తెలియడంతో భర్త మందలించడం
* భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య , ప్రియుడితో
* ఉదయాన్నే ట్రాక్టర్ తో గుద్దించి ప్రమాదంగా చిత్రీకరించి
* రామయ్య సహోదరుడు హత్య అని పోలీసులకు ఫిర్యాదు
* పోలీసులు పూర్తిగా విచారించగా వెలుగులోనికి వచ్చిన విషయాలు.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే: ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
fourth line news వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడు అని భర్తను ప్రియుడితో కలిసి భార్య అతి దారుణంగా హత్య చేయించింది. భార్య భర్తను చంపాలి అనే ఉద్దేశంతో ఇది హత్య కాకుండా ప్రమాదముగా చిత్రీకరించాలి అని ఆలోచించి టాక్టర్స్ తో ఢీ కొట్టించి ప్రమాదముగా చిత్రించినప్పటికిని పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చౌడాపూర్ మండల మండల కేంద్రానికి చెందిన రత్నయ్య కవిత దంపతులు. అదే గ్రామంలో నివసిస్తున్న రామకృష్ణతో కవిత వివాహారేతర సంబంధం కలిగి ఉంది. వీరిద్దరి విషయం భర్త రామయ్యకు తెలియడంతో భర్త ఆమెను మందలించడం జరిగింది. విషయం తెలిసిపోయింది అని ఇంకా తమ బంధం కొనసాగించడం కష్టము అని తన భర్తను అడ్డు తొలగించుకోవడానికి కవిత రామకృష్ణ ఇద్దరూ ఈ పథకాన్ని రూపొందించారు.
ఇద్దరూ ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని అమలుపరచడం మొదలుపెట్టారు. ఉదయం పొలం నుండి ఇంటికి తిరిగి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ డాక్టర్ తో వేగంగా ఢీకొట్టేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రత్నయ్య అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఆ ఊరు వారందరూ ఇది ఒక ప్రమాదముగానే అందరు భావించారు. అయితే రామయ్యకు ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుడు తన అన్న రుతిపట్ల అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తిరగడం జరిగింది.
పోలీసులు ఈ ప్రమాదాన్ని క్షుణ్ణంగా విచారించగా కవిత రామకృష్ణాల అక్రమ సంబంధం గురించి వెలుగులోనికి వచ్చింది. వారిద్దరినీ అదుపులోనికి తీసుకొని పోలీసులు విచారించగా పూర్తి వివరాలు బయటికి వచ్చాయి. తామే ఈ హత్యను చేసి ప్రమాదముగా చిత్రకరించాము అని అంగీకరించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రత్నయ్య వ్రతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ఊరు మొత్తం చాలా అల్లోకొల్లాన్ని సృష్టించింది. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0