ఇద్దరు వెళ్తే ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందేనా? లేదంటే భారీ చలానా .... చలానా ఎంతో తెలిస్తే షాక్ ??
విశాఖపట్నంలో అమల్లోకి వచ్చిన డబుల్ హెల్మెట్ నిబంధన. బైక్ పైన ఇద్దరికీ హెల్మెట్ లేకపోతే రూ. 1,035 జరిమానా. పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్ కథనంలో..
* బైక్ పైన వెళ్తున్నారా అయితే హెల్మెట్ తప్పనిసరి
* ఇద్దరు వెళ్తే ఇద్దరు హెల్మెంట్ పెట్టుకోవాలంట
* లేకపోతే భారీ చలన పడుతుంది
* విశాఖ పోలీసులు శాఖ ఏం చెప్పింది!
విశాఖపట్నం ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక కొత్త నిబంధనను ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుంది. బైకు పైన వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే నిబంధనను విశాఖ పోలీసులు అమలు చేస్తున్నారు. వాహనము నడిపే వారితోపాటు ఎవరైతే వెనకాల కూర్చుంటారో తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అని పోలీసులు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. పెట్టుకొన్నని వారికి దాదాపుగా 1,035 చేరినామా విధిస్తున్నారు.
జనవరి ఒకటి నుంచి ఈ-చలాన్లు జారి చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లోనే చాలా వేలాదిమందికి చలాన్లు వేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై పోలీస్ శాఖ సెప్టెంబర్ నుంచి అవగాహన కలిగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విశాఖ పట్టణములో ఉన్న ప్రజలందరూ బైక్ పైన వెళుతున్నప్పుడు తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోండి, మీ వెనకాల ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకునేటట్లు చూసుకోండి. లేకుంటే పోలీసులు కచ్చితంగా చలానా వేస్తారు. మరి ఈ విధమైన నిబంధన మరి ప్రజలు అంగీకరిస్తారా అనేది ముందు ముందు చూడాల్సి ఉంది. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0