తుఫాన్‌పై సీఎం చంద్రబాబుతో మాట్లాడిన ప్రధాని మోదీ – ముందస్తు చర్యలు తీసుకోమని సూచన | Fourth Line News
మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులపై సమాచారం తీసుకున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు Fourth Line Newsలో.
ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు.
మొంథా తుఫాన్ ప్రభావం, వర్ష పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని సూచనల మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఉన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి లోకేశ్కు PMOతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
చంద్రబాబు మాట్లాడుతూ — తుఫాన్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలి, కాల్వలు, గట్లు బలపరచాలి, పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు లోకేశ్, అనిత, సీఎస్ (చీఫ్ సెక్రటరీ) తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0