తుర్కియే సైనిక విమానం కుప్పకూలింది – గాల్లో తిరుగుతూ క్షణాల్లో నేలమట్టం (వీడియో
తుర్కియే ఎయిర్‌ఫోర్స్ C-130 కార్గో విమానం అజర్బైజాన్–జార్జియా సరిహద్దులో కుప్పకూలింది. రెక్కల నుంచి పొగలు వస్తూ గాల్లో తిరుగుతూ కిందపడిన వీడియో వైరల్ అవుతోంది. వివరాలు తెలుసుకోండి Fourth Line Newsలో.
తుర్కియే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన C-130 కార్గో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. అజర్బైజాన్ నుంచి తుర్కియే దిశగా బయలుదేరిన ఈ విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటన అజర్బైజాన్–జార్జియా సరిహద్దు ప్రాంతంలో జరిగింది.
విమానం రెక్కల నుంచి పొగలు వస్తూ, గాల్లో చక్రాలు కొడుతూ కింద పడిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన స్థలంలో రక్షణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య, ప్రాణ నష్టం గురించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0