తిరుపతి జిల్లాలో సంచలనం – ఇందిరమ్మ ఇళ్లలో ముగ్గురు మృతి చెందగా ప్రాంతంలో కలకలం
తిరుపతి ఇందిరమ్మ గృహాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. 22వ తేదీ నుంచి ఇంటి బయటికి రాకపోవడంతో స్థానికుల సమాచారంతో బయటపడిన ఈ విషాదకర సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* తిరుపతి జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది
* ఓకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు మృతి
* స్థానికులు పోలీసులకు ఫిర్యాదు
* 22 నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలేదు
* స్థానికులకు దుర్వాసన రావడంతో ఫిర్యాదు
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
తిరుపతిలో ఒక ఘోరమైన దృశ్యం వెలుగులోనికి వచ్చింది
తిరుపతిలో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ గృహల్లోని ఓ ఇంటిలో మూడు మృతదేహాలు ఉండటం కలకలం సృష్టించాయి. సత్యరాజ్ అనే వ్యక్తికి పొన్నాగుట్టె నాయగి (30)తో వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
తిరుపతి ఇందిరమ్మ ఇళ్లల్లోనికి మూడు నెలల క్రితం గుడి యాతం నుండి వచ్చి ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్లకి మూడేళ్ల కుమారుడు మనీష్ తో వచ్చిన పొన్నాగుట్టె నాయగి అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ దొరికే కూలి పనులు చేసుకుంటూ తమ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు.
22 తేదీ నుంచి వారు ఇంటిలో నుంచి బయటికి రాకుండా ఉండటం ఇంటి పక్కనున్న స్థానికులను కలవరపరిచింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఏదో దుర్వాసన వస్తుంది అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ సత్యరాజ్, పొన్నాగుట్టె, మనీష్, మరణించి ఉండటం చూసిన పోలీసులు చుట్టూ ఉన్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ వారు ఎలా చనిపోయారు అనే దాని గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.
* ఇంతకీ వాళ్ళు ఎలా మరణించారు ?
* ఈ వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0