‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై క్లారిటీ – జనవరి 9నే థియేటర్లలో ప్రభాస్
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడలేదని మేకర్స్ స్పష్టం చేశారు. జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదా పడుతుందనే ప్రచారంపై మూవీ టీమ్ స్పష్టత ఇచ్చింది. చిత్ర బృందం విడుదల తేదీపై ఎటువంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల అవుతుందని అధికారిక ప్రకటనలో తెలిపింది.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ క్లారిటీతో ఉత్సాహంగా ఉన్నారు
.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0