ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్! 5 నిమిషాలు ఆలస్యమైతే ఎగ్జామ్ నో ఎంట్రీ? బోర్డు కీలక నిర్ణయం!

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 5 నిమిషాలు ఆలస్యమైతే ఎగ్జామ్‌కు నో ఎంట్రీ. పరీక్ష తేదీలు, టైమింగ్ వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Jan 20, 2026 - 15:11
 0  3
ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్! 5 నిమిషాలు ఆలస్యమైతే ఎగ్జామ్ నో ఎంట్రీ? బోర్డు కీలక నిర్ణయం!

* త్వరలోనే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 

* ఇంటర్మీడియట్ బోర్డ్ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు 

* ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఐదు నిమిషాలు ఆలస్యం రావద్దు 

* ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి 

* విద్యార్థులు టైం కన్నా ఒక గంట ముందు వస్తే బాగుంటుంది.

 fourth line news : ఇంటర్ మీడియట్ విద్యార్థులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చే నెల ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి అని తెలియజేశాయి. 

తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. దానిలో భాగంగా పరీక్షకు వచ్చే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే పరీక్ష రాసేందుకు అనుమతించబోవు అని స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులందరూ ఒక గంట ముందుగానే రావడం మంచిది అని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. 

గత సంవత్సరంలో కూడా అమలు చేసిన విధంగానే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు కూడా తెలియజేయండి అని అధికారులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు వచ్చేసి : వచ్చేనెల ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 18 వరకు జరగనున్నాయి. కచ్చితంగా హాల్ టికెట్ తెచ్చుకొని ఒక గంట ముందు ఎగ్జామ్ కేంద్రం దగ్గరికి వస్తే చాలా మంచిది అని అధికారులు తెలియజేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.