తెలంగాణ మహిళలకు శుభవార్త: త్వరలోనే అందుబాటులోకి ఇండిరా మహిళ శక్తి చీరలు
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఇండిరా మహిళ శక్తి చీరల పథకాన్ని ప్రకటించింది. కోటి మహిళలకు రెండు విడతలుగా చీరల పంపిణీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
1. తెలంగాణ మహిళలకు ఒక గుడ్ న్యూస్
2. ఇందిరా మహిళ శక్తి చీరలు త్వరలోనే వస్తున్నాయి
3. రెండు విడతలక గా ప్రారంభించబోతున్నారు
4. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా కార్యక్రమం ప్రారంభమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఒక ఆనందకరమైన వార్త అందించింది. మహిళ సాధికారతను లక్ష్యంగా చేసుకొని ఇందిరా మహిళా శక్తి చీరలు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అర్హులైన కోటి మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు అంటూ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది.
తెలంగాణలో ఉన్న మహిళల యొక్క గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది. తెలంగాణ మహిళలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది.
ఈ చీరల పంపిణీ రెండు విడతలుగా చూస్తున్నట్టు మంత్రి వివరించారు. మొదటి విడతలో గ్రామీణ ప్రాంతాలలో ఈ నెల నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు చీరలను అందజేస్తాము. రెండో విడతలో పట్టణ ప్రాంతాలలోని మహిళలకు వచ్చే ఏడాది మార్చ్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ చీరలు అందుకొని ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాము. మహిళలందరికీ ఇది ఒక గొప్ప ఆనందకరమైన వార్తగా మేము భావిస్తున్నాము ( Fourth line news )
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0