సభకు రాయలసీమనే ఎంచుకున్న కూటమి – వెనుకున్న వ్యూహం ఏమిటి?

రాయలసీమలో సూపర్ హిట్ సభను ఎందుకు నిర్వహించాలనుకున్నది కూటమి ప్రభుత్వం? 2019లో కేవలం 3 సీట్లు గెలిచిన టిడిపి, 2024లో కూటమిగా అధికారంలోకి వచ్చి రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైసీపీకి బలమైన ఈ ప్రాంతంలో కూటమి పట్టు సాధించడానికి, సూపర్ సిక్స్ పథకాల విజయాన్ని ప్రజల ముందుంచడానికి ఈ సభను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది.

flnfln
Sep 10, 2025 - 13:35
Sep 10, 2025 - 13:40
 0  4
సభకు రాయలసీమనే ఎంచుకున్న కూటమి – వెనుకున్న వ్యూహం ఏమిటి?

సూపర్ హిట్ సభకు కూటమి ప్రభుత్వం రాయలసీమను ఎంచుకోవడం ఉన్న రహస్యం ఏమిటి ? 

సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు కూటమి ప్రభుత్వం రాయలసీమ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వైసీపీని దెబ్బ కొట్టేందుకే వ్యూహాత్మకంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 2019 ఎన్నికల్లో రాయలసీమలో టిడిపికి మూడు స్థానాల్లో వచ్చాయి. రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టిడిపి మాత్రము మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. చంద్రబాబు, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ ముగ్గురే గెలుపుని సాధించారు. 2024లో టిడిపి జనసేన బిజెపి ముగ్గురు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూటమికి 164 స్థానాలలో విజయం సాధించింది. వైసీపీకి మాత్రం 11 స్థానాలకి పరిమితి అవడం జరిగింది. కానీ రాయలసీమ ప్రాంతంలో వైసిపి ఏడు స్థానాలు గెలుచుకుంది. జగన్ సొంత జిల్లా అయిన కడుపులో మూడు స్థానాలు. చిత్తూరులో రెండు స్థానాలు. కర్నూల్ లో రెండు స్థానాలు వైసిపి గెలిచింది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. టిడిపి చరిత్రలోనే తొలిసారిగా కడపలో మహానాడు ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది. అనేక లక్షలాది జనాన్ని మీటింగే రప్పించి గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే పులివెందులలొ, వేంపల్లి జడ్పిటిసి ఉప ఎన్నికలలో విజయం సాధించి ఇంకా తన బలాన్ని పెంచుకుంది.

పులివెందులలో మొదటిసారి టిడిపి తన జెండాని ఎగరవేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే బలముతో అనంతపూర్ జిల్లాలో రాష్ట్రస్థాయిగా కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు వెళుతుంది. సూపర్ సిక్స్ లో ఐదు కార్యక్రమాలు అమలు చేసింది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వంటివి సూపర్ రెస్పాన్స్ ఉంది. అందుకే అనంతపూర్ లో సూపర్ హిట్ అయిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ బుధవారం సూపర్ సెక్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇచ్చిన పథకాలను ఎలా సూపర్ హిట్ చేసామో ప్రజలకి పూర్తిగా వివరిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 164 ఎమ్మెల్యేలు మూడు పార్టీల ముఖ్య నేతలు అగ్ర నేతలు హాజరవుతున్నారు. కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద భారీ సభ ఎక్కడ నిర్వహించలేదు. ఇప్పుడు రాయలసీమలో ఈ భారీ సభను సక్సెస్ చేయాలి అని అనుకుంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.