మంటల మధ్య కుక్కపిల్ల.. ఫైర్ సిబ్బంది చేసిన సాహసం చూస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్ సోమాజిగూడలోని ఆల్ పైన్స్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగగా, ఫైర్ సిబ్బంది ఒక కుక్కపిల్లను సురక్షితంగా కాపాడారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 30, 2025 - 15:42
Dec 30, 2025 - 15:44
 0  3
మంటల మధ్య కుక్కపిల్ల.. ఫైర్ సిబ్బంది చేసిన సాహసం చూస్తే షాక్ అవుతారు!

1. హైదరాబాదులో అగ్నిప్రమాదం కల్లోలం సృష్టించింది. 
2. ఒక అపార్ట్మెంట్లో 5వ అంతస్తు లో సిలిండర్ పేలుడు. 
3. ప్రాణా నష్టం ఏమీ జరగలేదు. 
4. అగ్నిమాపక సిబ్బంది ఒక కుక్క పిల్లను రక్షించారు. 

హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. సోమాజిగూడ ప్రాంతంలోని ఆల్ పైన్స్ అపార్టుమెంటులో శనివారం ఉదయం 5వ అంతస్తులో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దానికి అపార్టుమెంట్ మొత్తం ఉలిక్కిపడగా, మంటలు వేగంగా వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సర్వీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఈ ఘటనలో అయితే ఎవరి ప్రాణాలు కోల్పోలేదు.  అయితే, అపార్టుమెంట్‌లోని కొన్ని ఫ్లాట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న ఒక కుక్కపిల్లను అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా లోపలికి వెళ్లి రక్షించడంతో అందరి ప్రశంసలు అందుకున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు మరియు ఫైర్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ లేదా నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అపార్టుమెంట్ వాసులు భద్రతా చర్యలను మరింత కఠినంగా పాటించాలని అధికారులు సూచించారు.

అగ్నిమాప సిబ్బంది కరెక్ట్ టైం కి వచ్చి మంటలను అదుపు చేసింది. అలాగే ఆ ఇంట్లో ఉన్న కుక్కపిల్లను ప్రాణాలతో కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ మూగజీవాన్ని కూడా సురక్షితంగా రక్షించిన అగ్నిమాపసిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. 
*మనుషులను కాపాడటం ఎంత ముఖ్యమో మూగజీవాలను కాపాడటం కూడా అంతే ముఖ్యము. 
*ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.