దండోరా సెకండ్ హాఫ్ షాక్… శివాజీ నటనపై ప్రేక్షకులు ఫిదా!
ప్రముఖ నటుడు శివాజీ తన 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘కోర్టు’ మరియు ‘దండోరా’ సినిమాలతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాల్లో ఆయన పండించిన భావోద్వేగాలు మరియు నటనపై ప్రత్యేక విశ్లేషణ మీకోసం.
శివాజీ.. సెకండ్ ఇన్నింగ్స్ .....
1. దండోరా సినిమాలో శివాజీ క్యారెక్టర్ దుమ్ము దులిపింది
2. శివాజీ యాక్టింగ్...?
3. 13 ఏళ్ల తర్వాత ఇచ్చిన శివాజీ
4. కోర్టు మూవీతో తన నటన. ఇప్పుడు దండోరా తో?
5. స్టార్టింగ్ హీరోగా ఇప్పుడు సీనియర్ పాత్రలో నటన.
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ప్రముఖ నటుల్లో ఒకరు శివాజీ. కెరీర్ ఆరంభంలో లవ్ బ్యాక్స్ట్రాప్, ఫ్యామిలీ థీమ్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన శివాజీ, తన సక్సెస్ స్టోరితోనే కుర్రకారులను హృదయానికి దగ్గర చేశారు. అయితే, కెరీర్ లో కొన్ని పరిమితుల కారణంగా, శివాజీ దాదాపు 13 ఏళ్ల పాటు పెద్ద తెరపై కనిపించలేదు.
తన 13 ఏళ్ల గ్యాప్ తర్వాత శివాజీ సినిమాలోకి వచ్చి అనేక పాత్రలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు.. ఈ ఏడాది విడుదలైన ‘కోర్టు’ సినిమా, కేవలం ఒక సగటు సినిమా కాకుండా, నటుడి గుణాన్ని బయటపెట్టే ప్లాట్‌ఫారమ్‌గా మారింది. ఈ సినిమాలో శివాజీ మంగపతి క్యారెక్టర్లో నటించి, తన సీరియస్, లోతైన అభినయ శక్తిని చూపించారు. కథలో ఉన్న సామాజిక సమస్యలు, కుటుంబ సంక్షోభం, మరియు వ్యక్తిగత బాధలన్నీ శివాజీ నటన ద్వారా ప్రేక్షకుల హృదయానికి చేరాయి. ముఖ్యంగా కోర్ట్ రూమ్ సన్నివేశాల్లో అతని మినహాయింపు, శాంతంగా ఉన్నా ప్రభావవంతమైన నటన, విమర్శకులను కూడా మెప్పించింది.
ఇంకా, కుల వివక్ష నేపథ్యంతో తెరకెక్కిన ‘దండోరా’ సినిమా, శివాజీ నటుడిగా ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఇందులో తండ్రి పాత్రలో శివాజీ పూర్తిగా మారిపోయాడు . చిన్న కుటుంబ సమస్యలు, తండ్రి-కూతురు సంబంధం, మరియు సమాజంలో ఉన్న భేదభావాలను సున్నితంగా చూపించడంలో అతని నటన కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా కూతురు చనిపోయే సన్నివేశాల్లో శివాజీ భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరిచారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు అతనిలో మునుపటి హీరో చార్మ్‌తో పాటు, సీరియస్, లోతైన నటుడిగా అభినందించారు.
శివాజీ కెరీర్‌లో ఈ రెండో చాప్టర్, వయసు, అనుభవం, మరియు చారిత్రక నేపథ్యంతో తన స్థానాన్ని మరల ప్రస్థాపించింది. అతని రీఎంట్రీ కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, జూనియర్ నటులు, సినిమాటిక్ పరిశ్రమలో ఉన్న యువతరం కోసం కూడా ప్రేరణగా నిలిచింది. “వయసు కేవలం సంఖ్య మాత్రమే” అని, శివాజీ సినిమాటిక్ లోతుతో మళ్ళీ చరిత్రలో స్థానం సాధించినట్టు చెప్పవచ్చు.
కోర్టు, మరియు దండోరా సినిమాలో శివాజీ నటించిన ఆయన నటనకు అందరూ ఆశ్చర్యపోయారు, ఆయన మాటలు, ఆయన యాక్టింగ్, ప్రేక్షకులను బాగా అలరించాయి. రెండు సినిమాలు ద్వారా శివాజీ అసలు ప్రతిభను మళ్ళీ సృష్టించగలిగారు. ఫ్యామిలీ సామాజిక సమస్యలు నేపథ్యంలో నటించడం, ప్రాముఖ్యంగా కూతురు కష్టాల్లో ఉన్న సన్నివేశాలను సున్నితంగా నిజాయితీగా ప్రదర్శించడం శివాజీ యొక్క ప్రత్యక్షతగా చెప్పుకోవచ్చు
కెరియర్ ప్రారంభంలో హీరోగా గుర్తింపు పొందిన శివాజీ ఇప్పుడు నీటి తరానికి సీనియర్స్ లోతైన పాత్రలో తన నైపుణ్యాన్ని చూపెడుతూ సినీ ప్రపంచంలో మరోసారి తన యొక్క సత్యాన్ని చూపాడు అని చెప్పుకోవచ్చు. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఇంత ఘనంగా నటించగలడా అని ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఆయన నటించాడు.
మొత్తానికి శివాజీ కెరియర్లో ఈ సెకండ్ ఇన్నింగ్స్, అతనికిని ప్రేక్షకులకు మరింత ఇండస్ట్రీకి పెద్ద ఆనందము మరియు గౌరవం తీసుకొని వచ్చింది. కోర్టు మరియు దండోరా సినిమాలు చూసినట్టయితే, వయస్సు, గ్యాప్, లేదు ఇబ్బందుల కేవలము అడ్డు కాదు అని నిజమైన ప్రతిభ ఎప్పటికీ మెరుపు చూపుతుంది అనే మాటను శివాజీ తన నటన ద్వారా మళ్ళీ నిరూపించాడు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0