టికెట్ లేని ప్రయాణికులపై రైల్వే కొరడా – ఒకేరోజు రూ. కోటి జరిమానా వసూలు
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుని రూ.1.08 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇది SCR చరిత్రలో రికార్డు.
Main headlines :
1. టికెట్ లేని ప్రయాణికులపై సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కఠిన చర్యలు చేపట్టింది.
2. జోన్ పరిధిలో జరిగిన ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులు పట్టుబడ్డారు.
3. సాధారణంగా రోజుకు సగటున ₹47 లక్షల జరిమానాలు వసూలు అవుతుంటే, అక్టోబర్ 13న రికార్డు స్థాయిలో ₹1.08 కోట్లు వసూలు చేశారు.
4. విభాగాల వారీగా – విజయవాడ డివిజన్ ₹36.91 లక్షలు, గుంతకల్లు ₹28 లక్షలు, సికింద్రాబాద్ ₹27.9 లక్షలు, గుంటూరు ₹6.46 లక్షలు, హైదరాబాద్ ₹4.6 లక్షలు, నాదెండ్ ₹4.08 లక్షలు వసూలయ్యాయి.
5. ఇది SCR చరిత్రలో ఒకేరోజు వసూలైన అత్యధిక జరిమానాగా నమోదైంది.
6. టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా విధించబడవచ్చని అధికారులు హెచ్చరించారు.
పూర్తి వివరాల్లోనికి వస్తే ;
టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించే వారిపై సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కఠిన చర్యలు చేపట్టింది. సోమవారం జోన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులు దొరికారు.
రోజువారీగా జరిమానాల రూపంలో సగటున ₹47 లక్షలు వసూలు అవుతుండగా, అక్టోబర్ 13న మాత్రం రికార్డు స్థాయిలో ₹1.08 కోట్ల జరిమానా వసూలు చేయడం SCR చరిత్రలో తొలిసారి జరిగింది.
విభాగాల వారీగా పరిశీలిస్తే – విజయవాడ డివిజన్ ₹36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్ ₹28 లక్షలు, సికింద్రాబాద్ ₹27.9 లక్షలు, గుంటూరు ₹6.46 లక్షలు, హైదరాబాద్ ₹4.6 లక్షలు, నాదెండ్ ₹4.08 లక్షలు జరిమానా వసూలు చేశారు.
రైల్వే అధికారులు టికెట్ లేకుండా ప్రయాణించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0